వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏ నిరసనలు: ఆ పోలీసు అధికారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా, ప్రశంసలు(వీడియో)

|
Google Oneindia TeluguNews

లక్నో: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు విద్యార్థులు కూడా ఆందోళనలు పాల్గొంటున్నారు. పలు చోట్ల ఆందోళకారులు విధ్వంసానికి కూడా దిగుతున్నారు. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

అపోహలు తొలగించే యత్నం

అపోహలు తొలగించే యత్నం

ఇది ఇలావుంటే.. పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన చేస్తున్న విద్యార్థులు, యువత, ప్రజల దగ్గరికి వెళ్లిన ఓ పోలీసు ఉన్నతాధికారి చేసిన పనికి ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారుల్లో సీఏఏపై నెలకొన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారాయన. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదన్నారు.

భారతీయులకు నష్టం లేదంటూ..

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావాలో అక్కడి ఎస్ఎస్పీ సంతోష్ మిశ్రా శుక్రవారం ఉదయం సీఏఏ నిరసనల్లో పాల్గొన్న ముస్లిం యువకుల దగ్గరకు వెళ్లారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ)ల గురించి వివరించారు. ఆ చట్టాల వల్ల భారతీయులైన వారికి ఎలాంటి నష్టం లేదని చెప్పారు.

ఇక్కడే ఉంటారు.. ఇక్కడే చదువుకుంటారు..

ఇక్కడే ఉంటారు.. ఇక్కడే చదువుకుంటారు..

‘మీరు ఇక్కడ్నుంచి వెళ్లిపోవాల్సిందేనని ఎవరు చెప్పారు? మీకు ఎక్కడికీ వెళ్లరు.. ఇక్కడే ఉంటారు. ఇక్కడే చదువుకుంటారు. ఇక్కడే మీరు ఇలా పోలీసు అధికారులు కావాలి. ఈ బిల్లు గురించి వచ్చే పుకార్లను నమ్మకండి. చట్టాన్ని మాత్రమే నమ్మండి. భారతీయ ముస్లింలకు సీఏఏ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదు. కేవలం ఇతర దేశాల నుంచి భారత్‌లోకి వచ్చే వాళ్ల గురించే ఈ చట్టం చెబుతోంది. దయచేసి అందరూ శాంతియుతంగా, సామరస్యంగా ఉండండి' అని ఎస్ఎస్పీ సంతోష్ మిశ్రా నిరసన తెలుపుతున్న యువతకు వివరించారు.

పోలీసులు ఇలానే ఉంటారు..

ఎస్ఎస్పీ సంతోష్ మిశ్రా చెప్పినదంతా విన్న నిరసనకారులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. బాలా అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

‘సంతోష్ మిశ్రా అనే అధికారి సీఏఏ గురించి ప్రజలకు వివరించారు. పోలీసులంటే ఇలావుంటారు. పోలీసులు ప్రజలకు హాని చేయరు. కానీ, ఆవేశంతో మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే.. సామాన్య ప్రజలను కాపాడటం కోసం పోలీసులు వారి శక్తిని చూపించక తప్పదు' అని అతడు పేర్కొన్నాడు. కాగా, ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించిన సదరు పోలీసు అధికారిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

English summary
Amid the violent protests and the subsequent police action against the protesters, a heartwarming video of a police officer giving advice to anti-CAA protesters is going viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X