వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోరుబావిలో మేకపిల్ల: ప్రాణాలకు తెగించి కాపాడారు, ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

Goat Rescue Mission Viral Video | వైరల్ అవుతున్న 'గోట్ రెస్క్యూ మిషన్' వీడియో | Oneindia TElugu

బెంగళూరు: ఓ మేక పిల్లను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదు ఆ యువకులు. పొరపాటు జరిగితే తమ ప్రాణాలు పోతాయని తెలిసినా.. ఆ మేక పిల్ల ప్రాణాలు కాపాడిన యువకులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మేకపిల్లను కాపాడిన 'రెస్క్యూ ఆపరేషన్' వీడియో వైరల్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఓ అటవీ ప్రాంతంలో మేతకోసమని వచ్చిన మేకపిల్ల తెరిచివున్న బోరుబావిలో పడిపోయింది. దీన్ని గమనించిన యువకులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ మేక పిల్లను ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకున్నారు.

VIDEO: This unique ‘Indian rescue mission’ in Karnataka garners praise on Twitter

ఆ యువకుల్లో ఓ వ్యక్తిని ఆ బోరుబావిలోకి తలకిందులుగా లోపలికి పంపి.. ఆ మేక పిల్లను బయటకు తీశారు. అక్కడున్న మరో వ్యక్తి దీన్నంతా వీడియో తీసీ సోషల్ మీడియాల్లో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కొందరైతే 'ది ఇండియన్‌ రెస్క్యూ మిషన్‌' అనిపేర్కనగా, 'ఇది మరో థాయ్‌లాండ్‌ తరహా సాహసం', అని 'వీళ్లను చూస్తుంటే మానవత్వం ఇంకా బతికే ఉంది. మనుషులకు జంతువుల మీద కొంతైనా దయ మిగిలే ఉంది' 'ఇదో అద్భుత సాహసం', 'వారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాం', 'ఆ మేక పిల్ల ఎవరి పళ్లెంలోనూ భోజనం కాకూడదని కోరుకుంటున్నా' అని నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఏది ఏమైనా వారు చేసిన సాహసాన్ని మాత్రం ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.

English summary
Even as the world continues to rave over the miraculous and humane Thailand rescue mission that saved 12 young boys and their football coach, in India, another rescue mission seems to garnering attention too. A video of a bunch of young men coming together to save a little goat from a deep tube-well has gone viral on the Internet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X