వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ గీతం ఆలపిస్తుంటే.. ఆ ఎమ్మెల్యే ఏం చేశారంటే..(వీడియో)

అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే వైశాలి దాల్మియా ఆదివారం హౌరాలో నిర్వహించిన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయగీతాలాపన జరుగుతుండగా మౌనంగా నిలబడాల్సిన ఎమ్మెల్య

|
Google Oneindia TeluguNews

హౌరా: జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించడంలో ప్రజాప్రతినిధులు ఏ రీతిలో నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. జాతీయ గీతాన్ని గౌరవించాల్సిన బాధ్యతను విస్మరించిన ఓ ఎమ్మెల్యేనే జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే వైశాలి దాల్మియా ఆదివారం హౌరాలో నిర్వహించిన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయగీతాలాపన జరుగుతుండగా మౌనంగా నిలబడాల్సిన ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు.

VIDEO: TMC MLA Vaishali Dalmiya caught talking on phone during national anthem

కాగా, ఈ వ్యవహారం కెమెరాకు చిక్కింది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐసీసీ, బీసీసీఐకి అధ్యక్షుడిగా వ్యవహరించిన జగ్‌మోహన్‌ దాల్మియాకు ఈమె కుమార్తె కావడం గమనార్హం.

ఇంతకుముందు జమ్మూకాశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా కూడా ఇలాగే మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్నారు. కాగా, సినిమా థియేటర్లలో జాతీయగీతాలాపన తప్పనిసరి చేస్తూ సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత.. ఇటీవల గీతాలాపన సమయంలో లేచి నిల్చోకపోవడంతో ఆరుగురిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

English summary
A Trinamool Congress MLA was caught on camera Sunday talking over the phone while the national anthem was being played at a sporting event in Howrah, news agency ANI reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X