వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ రద్దీ రోడ్డులో దిగ్భ్రాంతికరం: కారు బానెట్‌పై ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లాడు(వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఎంతో రద్దీగా ఉండే రహదారిపై దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ కారును ఆపేందుకు ప్రయత్నించిన పోలీసును.. కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు ఓ దుర్మార్గుడు. కొంత దూరం ఈడ్చుకెళ్లిన తర్వాత ఆ పోలీసు కారు పైనుంచి రోడ్డుపై పడ్డాడు.

సుమారు 400 మీటర్ల దూరం వరకు పోలీసును కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. కాగా, దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కారు బానెట్ పట్టుకుని వేళాడుతున్న ఆ పోలీసు.. ఒకసారి పట్టుతప్పి కారు కిందపడిపోయినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.

He has been arrested on charges of obstructing, hurting and wrongful driving.

పోలీసు కిందపడిన తర్వాత కారును ఆపకుండా తీసుకెళ్లాడు కారులో ఉన్న వ్యక్తి. దక్షిణ ఢిల్లీలోని ధౌలా కౌన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిపాల్ అనే సింగ్ కానిస్టేబుల్ అనే కానిస్టేబుల్ ట్రాఫిక్స్ రూల్స్ పాటించని ఆ కారును ప్రయత్నించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ గల ఆ కారులోని డ్రైవర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కారు ఆపకుండా దూసుకెళ్లాడు. కారు బానెట్‌పై పోలీసు ఎక్కడంతో అతడ్ని కిందపడేసేందుకు రద్దీ రోడ్డు అని కూడా చూడకుండా కారు డ్రైవర్.. కారును అటూ ఇటూ తిప్పడం గమనార్హం.

కాగా, పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడ్ని కిలోమీటరు వరకు ఛేజ్ చేసిన పోలీసులు పట్టుకున్నారు. నిందితుడ్ని సౌత్ వెస్ట్ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన శుభమ్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసు విధులను అడ్డుకోవడం, బాధించడం, తప్పుగా నడపడం వంటి ఆరోపణలపై అతన్ని అరెస్టు చేశారు.

English summary
He has been arrested on charges of obstructing, hurting and wrongful driving.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X