వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్లక్ష్యం: విరిగిన రైలు పట్టాను బట్టతో కట్టారు...వీడియో వైరల్

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు గోవండి మన్‌కుర్ద్ రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ రెండుగా చీలింది. దీనికి అరగంటలో మరమత్తులు చేసింది సిబ్బంది. అయితే అంతలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చీలిన ఆ పట్టాను ఓ పాత బట్టతో కట్టడం ఆ వీడియోలో ఉంది.

ఈ వీడియో వైరల్ అవడంతో రైల్వే అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. విరిగిన ఆ పట్టా దగ్గర మార్కర్ కోసమే ఆ బట్టను చుట్టామని చీలిన బాగాన్ని కలిపేందుకు కాదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఫిష్ ప్లేట్ విరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పిన అధికారులు... దాన్ని మరమత్తు చేసేందుకు ముందుగా మార్క్ చేసుకుంటామని అది పెయింట్‌తో మార్క్ చేసుకుంటామని చెప్పారు. అయితే భారీగా కురుస్తున్న వర్షాలకు పెయింట్ తుడుచుపెట్టుకుపోతుంది కనుక పెయింట్ స్థానంలో మార్కర్‌లా బట్టను చుట్టామే తప్ప.... రెండుగా చీలిన పట్టాని కలిపేందుకు బట్టను చుట్టలేదని వివరణ ఇచ్చారు.

Video trying to bridge the gap of a broken track goes viral

మరోవైపు రైల్వే భద్రత, ప్రయాణికుల భద్రతపై రైల్వే కమిషనర్‌చే ఎంక్వైరీ వేయాలని ఆర్టీఐ యాక్టివిస్టు సమీర్ జవేరీ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు వర్షపు నీరు రైల్వే ట్రాక్ పైకి వచ్చి చేరుతుండటంతో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు.

English summary
A video that surfaced on social media had once again showed how irresponsible the railway department is. A rail fracture was reported between the suburban Govandi and Mankhurd stations on the Harbour Line.It was repaired within half an hour.But a video soon began to do rounds, which claimed that a piece of cloth was used to tie up the fractured part.Railway officials clarified that the cloth only marked the point of fracture, and it was not used to bridge the crack
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X