వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sonali Phogat: బతికే హక్కు లేదంటూ అధికారిని చెప్పుతో కొట్టారు, ఎందుకంటే..?(వీడియో)

|
Google Oneindia TeluguNews

ఛండీగఢ్: టిక్‌టాక్ స్టార్, భారతీయ జనతా పార్టీ నేత సోనాలీ ఫోగట్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. హర్యానాలోని హిసార్‌లో ఓ ప్రభుత్వ అధికారిపై ఆమె చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ తోపాటు పలు రాజకీయ పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి.

అధికారిపై చేయి చేసుకుని..

అధికారిపై చేయి చేసుకుని..


సోనాలీ ఫోగట్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలోని అదంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిపై ఓడిపోయారు. టిక్‌టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు ఈ వివాదంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. బాల్సమంద్ మార్కెట్ కమిటీ సెక్రటరీ సుల్తాన్ సింగ్ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు వారిని దుర్భాషలాడారంటూ ఆమె అతనిపై చేయి చేసుకున్నారు.

నీకు బతికే హక్కు లేదంటూ..

నీకు బతికే హక్కు లేదంటూ..

రైతులతోపాటు తనను కూడా దుర్భాషలాడారంటూ సోనాలీ ఫోగట్ సదరు అధికారిపై చేయి చేసుకున్నారు. నేను ఇక్కడ పనిచేసేది నీలాంటి వారితో దుర్భాషలు పడటానికా? నాకు గౌరవంగా బతికే అవకాశం లేదా? నీకు బతికే హక్కు లేదు అంటూ సదరు అధికారిపై సోనాలి ఫోగట్ తీవ్రంగా మండిపడ్డారు. ఇదంతా ఆ వీడియోలో రికార్డైంది. తన పట్ల అమర్యాదగా వ్యవహరించాడని, దుర్భాషలాడాడని పోలీసులకు సోనాలీ ఫోగట్.. సుల్తాన్ సింగ్ పై ఫిర్యాదు చేశారు. అయితే, ఫోగట్.. సదరు అధికారిని కొడుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రైతులతోపాటు తనను దుర్భాషలాడారంటూ...

రైతులతోపాటు తనను దుర్భాషలాడారంటూ...

సుల్తాన్ సింగ్.. పంట సేకరణ ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు సృష్టించారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలోనే సదరు అధికారి, సోనాలీ ఫోగట్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రైతులతోపాటు తనపై దుర్భాషలాడటంతోనే తాను చేయి చేసుకున్నానని ఫోగట్ తెలిపారు. కాగా, ఫోగట్ చెప్పిన ప్రతీ విషయాన్ని తాను నోట్ చేసుకున్నానని, రైతుల కోసం ఓ షెడ్ నిర్మించే విషయంపై కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

అధికారంలో ఉండి ఇలాంటి దాడులా?


కాగా, కాంగ్రెస్ పార్టీ నేత రణదీప్ సర్జేవాలా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఫోగట్‌పై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీ నేత ఇలా వ్యవహరిస్తే చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. ఆమెపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మరోసారి డిమాండో చేశారు.

English summary
Bharatiya Janata Party leader Sonali Phogat has landed in a controversy as a video fo her beating an official in Haryana's Hisar district has gone viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X