వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video: టీకా తీసుకోమంటే నవ్వుతున్న పోలీసు.. నర్సు తాకగానే చక్కిలిగింతలతో..

|
Google Oneindia TeluguNews

కోహిమా: కరోనాను నిర్మూలించేందుకు దేశ వ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమంగా వేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా నాగాలాండ్‌లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు పలువురు భయపడుతున్న విషయం తెలిసిందే.

టీకా కోసం వచ్చిన ఈ నాగాలాండ్ పోలీసు నర్సు తాకగానే నవ్వులు

టీకా కోసం వచ్చిన ఈ నాగాలాండ్ పోలీసు నర్సు తాకగానే నవ్వులు


మరికొందరు టీకా ఇచ్చే సమయంలో ఏడవడం, మరికొందరు ఏమి తెలియనట్లుగా అయిపోయిందా? అంటూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. కానీ, ఓ నాగాలాండ్ పోలీసు మాత్రం వ్యాక్సిన్ తీసుకునే సమయంలో విపరీతంగా నవ్వడం విశేషం. టీకా ఇస్తున్న సమయంలో ఆయన నవ్వు ఆపుకోలేకపోయాడు. నవ్వుతూనే ఉన్నాడు.
వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన సదరు పోలీసుకు ఇంజక్షన్ ఇవ్వడానికి నర్సు అతడి చేతిని పట్టుకోగానే చక్కలిగింతలతో నవ్వడం మొదలుపెట్టాడు. దీంతో ఇద్దరు నర్సులు అతడ్ని పట్టుకుని వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయినా అతడు నవ్వు ఆపకుండా కొనసాగించాడు.

కరోనా వ్యాక్సిన్.. చక్కిలిగింతల పోలీసు

ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. 'నాగాలాండ్‌కు ఈ పోలీస్ మొత్తానికి వ్యాక్సిన్ తీసుకున్నాడో లేదో తెలియట్లేదు. కానీ, అతడిని సూది కన్నా చక్కిలిగింతలే ఎక్కువగా కలవరపెడుతున్నాయి' అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సదరు చక్కిలిగింతల పోలీసు ఫేమస్ అయిపోతున్నాడు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రథమ మహిళ

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రథమ మహిళ

ఇది ఇలావుండగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా రెండు కోట్ల మందికిపైగా వ్యాక్సిన్లు తీసుకున్నారు. మార్చి 1న రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన రోజున ప్రధాని నరేంద్ర మోడీ తొలి వ్యాక్సిన్ డోసు వేయించుకోగా.. ఆ తర్వాత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా 60 ఏళ్లు పైబడిన పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు టీకా తీసుకున్నారు. కాగా, మహిళా దినోత్సవం రోజు(ఫిబ్రవరి 8)న దేశ ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్ కరోనా టీకా తీసుకున్నారు. మహిళా సాధికారత కోసం ఈ టీకా తీసుకున్నానంటూ ఆమె వ్యాఖ్యానించారు.

English summary
video viral: nagaland police cop laughing during taking corona vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X