వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: మగాళ్లకు సవాల్.. బతికున్న కొండ చిలువను పట్టుకున్న మహిళ

|
Google Oneindia TeluguNews

Recommended Video

వీడియో వైరల్: మగాళ్లకు సవాల్.. బతికున్న కొండ చిలువను పట్టుకున్న మహిళ

కేరళ: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన చీమ చిటుక్కుమన్నా వెంటనే విషయం తెలిసిపోతోంది. కొద్ది రోజుల క్రితం రైల్వే గేటును సున్నితంగా ఎత్తిన గజరాజు, పాలు తాగిన రెండు తలల పాము, ఇతర వింతలు విశేషాలు ఇట్టే సోషల్ మీడియాలో కథనాలుగా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టేస్తోంది.

20 కిలోల కొండచిలువను పట్టుకున్న మహిళ

పాములు అన్నా పాము గురించి చర్చించాలన్న ఒళ్లు భయంతో వణుకుతుంది. అలాంటిది ఓ మహిళ 20 కిలోల బరువున్న కొండ చిలువను పట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూస్తే గూస్‌బంప్స్ రావడం ఖాయం. ఒక నిమిషం 36 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో క్లిప్పింగ్‌ను హరీందర్ సిక్కా అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఏకంగా 19వేల వ్యూస్ వచ్చాయి.

ఇంటి వెనకాల ఉన్న చెట్టు దగ్గర బుసకొట్టిన పైథాన్

ఇంటి వెనకాల ఉన్న చెట్టు దగ్గర బుసకొట్టిన పైథాన్

మహిళ కొండచిలువను పట్టుకుంటున్న వీడియోను పోస్టు చేసిన హరీందర్ సిక్కా ఓ క్యాప్షన్ రాశాడు. విద్యారాజు అనే మహిళ ఈ 20 కిలోల కొండచిలువను పట్టుకుందని చెప్పారు. ఆమె సీనియర్ నేవీ ఆఫీసర్ భార్య అని తెలిపాడు. కేరళలోని ఎర్నాకులంలో ఉన్న తన ఇంటి వెనకాల ఈ కొండచిలువ నక్కి ఉంది. ఆ ప్రాంతమంతా దట్టని గడ్డితో ఉంటుందని హరీందర్ చెప్పాడు. ఇక ఎక్కడి నుంచో వచ్చి ఓ చెట్టు వెనకాల మెల్లగా బుస కొడుతూ కనిపించింది కొండచిలువ. అది చూసిన విద్యారాజు దాని మెడను పట్టుకోగా మరో వ్యక్తి తోకను పట్టుకున్నాడు.

మగాళ్లకు దమ్ముందా అంటూ నెటిజెన్ల ప్రశ్న

ఇక ఈ కొండచిలువను పట్టుకునేందుకు ముగ్గురు నేవీ అధికారులు మరియు ఓ అమ్మాయి సహాయం చేశారు. ఈ కొండచిలువను పట్టుకున్న విద్యారాజు ఓ పెద్ద సంచిలో వేసింది. దీన్ని ఆ బ్యాగులో వేసేందుకు మరింత కష్టపడాల్సి వచ్చింది. కొండచిలువను బ్యాగులో వేస్తుండగా ఈ మొత్తం ఘట్టాన్ని మరో వ్యక్తి వీడియో తీశాడు. ఇక విద్యారాజు పాము నోరును ముందుగా బ్యాగులో వేసి గట్టిగా కట్టేసింది. వీడియోలో ఇదే ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తుంది. ఇక ఈ వీడియో పోస్టు చేయగానే నెటిజెన్లు తమదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఒక మహిళ చేసిన ఈ సాహసాన్ని ఎంతమంది మగాళ్లు చేయగలరు అంటూ ప్రశ్నించారు.

English summary
A woman captured a 20kg python alive in Ernakulam. The video has gone viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X