చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై: ఒక్క ఆహార పొట్లం చాలని మహిళ (వీడియో), మోడీ ఏరియల్ సర్వే

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు వరద సహాయకచర్యల్లో ఎన్టీఆర్ఎఫ్, ఐఏఎప్, సైన్యం ముమ్మరంగా పాల్గొంటోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వరదల్లో చిక్కుకున్న వారికి ఆహార పొట్లాలు, నీటి ప్యాకెట్లు వేస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా వాటిని ఇస్తున్నారు.

ఓ ప్రాంతంలో ఓ మహిళ... తనకు ఆహార పొట్లాలు చాలు అని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. టెర్రాస్ పైన నిలబడిన బాధిత ప్రజలకు అందిస్తున్నారు.

ఇందులో భాగంగా ఓ ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది టెర్రాస్ పైన ఉన్న మహిళకు ఆహార పొట్లాలు కిందకు వేశారు. వారు ఒకటి వేశారు. ఆ తర్వాత మరిన్ని జార విడవకుండా ఉండేందుకు ఆ మహిళ... తనకు ఒకటి చాలు అని చెప్పింది. ఇంకా ఎక్కువ వద్దని చెప్పారు.

Video: woman signals to IAF chopper to not drop more saying its sufficient

చెన్నైలో సహాయక చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 100 బోట్లు, 1200 మంది సిబ్బంది సహాయచర్యల్లో పాల్గొంటున్నట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ తెలిపారు. ఇప్పటి వరకు 70వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెన్నై కార్పోరేషన్‌ కమిషనర్‌ విక్రమ్‌ వెల్లడించారు.

సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. వరద నుంచి బయటకు రాలేక చిక్కుకుపోయిన వారికి సహాయ బృందాలు హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలు చేరవేస్తున్నారు.

గురువారం ఉదయం కాస్త తెరిపివ్వడంతో నగర వాసులు ఒక్కసారిగా నిత్యావసర వస్తువుల కోసం రోడ్లపైకి వచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు ఐదురెట్లు అధికంగా విక్రయిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు వస్తువుల ధరలను అమాంతం పెంచేశారు.

దీంతో చేసేదేమీ లేక వరద బాధితులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కూరగాయలన్నీ కిలో రూ.వందకు తక్కువ కాకుండా అమ్ముతున్నారు. పాలుసైతం లీటర్‌ రూ.వందపైనే అమ్ముతున్నారు. వరుణుడి దెబ్బకు సర్వం కోల్పోగా.. వ్యాపారులు దోచుకోవడం గమనార్హం.

తమిళనాడుకు తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు

భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమిళనాడు రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. సీఎం జయలలిత, గవర్నర్‌ రోశయ్యతో ప్రధాని భేటీ అయ్యారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై ఆరా తీశారు.

కేంద్రం తరపున తమను ఆదుకోవాలని జయలలిత కోరారు. దీంతో మోడీ స్పందిస్తూ... తమిళనాడుకు తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. వరద పరిస్థితిని వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ఆయన తిలకించారు. అనంతరం వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌లో చెన్నై సహా, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు.

English summary
Food packet lands on rooftop, woman signals to IAF chopper to not drop more saying its sufficient.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X