వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాల్యా: రాజ్యసభ సభ్యుడిగా ప్రతి పైసా వసూల్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యునిగా ప్రతి పైసాను రాబట్టుకున్నారు.. వేతనాలతో పాటు అన్ని రకాల ప్రోత్సకాలను పూర్తిగా అనుభవించారు. మొహమ్మద్ ఖలీద్ జిలానీ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం కింద ఆ విషయాలు బయటకు వచ్చాయి.

విజయ్ మాల్యా 2002లో కాంగ్రెస్, జేడీఎస్ మద్దతుతో కర్నాటక నుంచి మొదటిసారి స్వతంత్ర్య అభ్యర్థిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2010లో బీజేపీ, జేడీఎస్ సపోర్టుతో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యునిగా ప్రతి నెలా రూ. 50,000 గౌరవ వేతనంతో పాటు నియోజకవర్గం భత్యం కింద మరో రూ. 20,000 పొందారు.

Vijay Mallya

మాల్యా ఇతర ఖర్చులను కూడా రాబట్టుకున్నారు. కార్యాలయ నిర్వాహణ కింద నెలకు ఆరు నుంచి పదిహేను వేలు, ఫోన్ బిల్లు కింద లక్షా 73 వేలను తిరిగి పొందారు. అయితే కరెంట్, వాటర్ , వైద్యంతో పాటు విమాన ప్రయాణ ఖర్చులను మాత్రం ఆయన రీయింబర్స్‌మెంట్ చేయలేదు.

దాదాపు 17 జాతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగవేసి మార్చి నెలలో లండన్ పారిపోయిన విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యత్వం జులై నెలతో ముగుస్తుంది. సరదా మనిషిగా పేరు పొందిన విజయ్ మాల్యాకు సంబంధించిన ఆ విషయాలు గమనించి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు జీలానీ చెప్పారు.

అయితే, విద్యుత్తు, నీటి వినియోగానికి సంబంధించిన ఖర్చులను, వైద్యం ఖర్చులను మాత్రం మాల్యా క్లెయిమ్ చేయలేదు.

English summary
Liquor baron Vijay Mallya may be a billionaire, but he did not hesitate to claim amounts as little as Rs 20,000 as perks to which he was entitled to as a Rajya Sabha MP, a reply to an RTI query has revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X