వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక నేనేం చేయాలి?: మోడీపైకి నెట్టిన విజయ్ మాల్యా! సంచలన విషయాలు వెల్లడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: బ్యాంకులకు వేల కోట్లు టోపీ పెట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా మంగళవారం నాడు తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను రెండేళ్ల క్రితమే 15 ఏప్రిల్ 2016లో ప్రధానితో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.

భారత ప్రభుత్వ పెద్ద విజయం: స్వదేశానికి వచ్చి 13వేల కోట్ల అప్పులు చెల్లిస్తానన్న మాల్యాభారత ప్రభుత్వ పెద్ద విజయం: స్వదేశానికి వచ్చి 13వేల కోట్ల అప్పులు చెల్లిస్తానన్న మాల్యా

బ్యాంకుల నుంచి తాను తీసుకున్న అప్పును చెల్లించేందుకు తాను సంసిద్ధత వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్లు తెలిపారు. బ్యాంకులకు ఎగవేత విషయంలో తనను మీడియా అనవసరంగా టార్గెట్ చేసుకుందని చెప్పారు. బ్యాంకు డిపాజిటర్ల పేరుతో తనను పోస్టర్ బాయ్‌ను చేశారని పేర్కొన్నారు. తనపై ఎగవేతదారు ముద్రవేశారని వాపోయారు. మాల్యా ఏం చెప్పారంటే..

నేను మోడీ, జైట్లీలకు ఎప్పుడో లేఖ రాశా, వాళ్లే మౌనంగా ఉన్నారు

'నేను 15 ఏప్రిల్ 2016లో ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశాను. ఈ లేఖను తాను ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకు వస్తున్నాను. నేను బ్యాంకుల లోన్ విషయంలో సెటిల్ చేయడానికి సిద్ధమైనప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు' అని విజయ్ మాల్యా తప్పును వీరి పైకి తోసేశారు. వారు చాలాకాలంగా మౌనం వహించారని ఆరోపించారు.

రాజకీయ జోక్యంతో నేనేం చేయగలను

'కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం బ్యాంకులు ఇచ్చిన రూ.9000 కోట్ల లోన్లను నేను ఎత్తుకెళ్లానని రాజకీయ నాయకులు, మీడియా ఆరోపణలు చేసింది. కొన్ని బ్యాంకులు అయితే నేను డిఫాల్టర్‌ను ముద్ర కూడా వేశాయి. నేను చెప్పేదేమంటే ఈ అంశాన్ని సెటిల్ చేసుకోవడానికి నేను ప్రతి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను' అని మాల్యా వెల్లడించారు. ఈ అంశం రాజకీయ అంశమై కూర్చున్నదని, ఇది రాజకీయం కావడం కారణంగా నేను ఏం చేయలేకపోయానని వెల్లడించారు. రాజకీయం జోక్యం చేసుకోవడంతో నేను ఏం చేయలేకపోయానని అభిప్రాయపడ్డారు.

నేను అప్పు తీర్చాలని ప్రభుత్వం కోరుకుంటుందా లేదా?

ప్రభుత్వ బ్యాంకులు సహా, నేను అప్పు తీసుకున్న బ్యాంకులకు రుణాలు చెల్లించడం కోసం నా ఆస్తులు అమ్మివేసేందుకు తమ గ్రూప్ దరఖాస్తులు చేసుకుందని, కానీ ఈడీ మాత్రం వాటిని అమ్మేందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఆశ్చర్యకరమైన విషయం. దీంతో అసలు నేను పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం కోరుకుంటుందా, లేదా అనేది నా మౌలిక ప్రశ్న' అని మాల్యా పేర్కొన్నారు.

రూ.13,900 కోట్ల ఆస్తులు విచారణ సంస్థల చేతుల్లో

'నాకు చెందిన పలు అసెట్స్‌ను ఈడి స్వాధీనం చేసుకుంది. నా చేతుల్లో లేదా నా కుటుంబం చేతుల్లో ఉన్న కంపెనీల ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ జఫ్తు చేసుకుంది. వీటి విలువ రూ.13,900 కోట్లు.' అని విజయ్ మాల్యా వెల్లడించారు. మోడీకి రాసిన లేఖను ఆయన విడుదల చేయడం గమనార్హం.

English summary
Fugitive tycoon Vijay Mallya today released a two-year-old letter (scroll down to read) to Prime Minister Narendra Modi and said in a statement he was "making every effort" to settle his dues to banks but he had been made the "Poster Boy" of bank default and a lightning rod for public anger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X