వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాల్యా 'కింగ్ ఫిషర్ విల్లా'ను కొనుగోలు చేసిన హీరో.. ఎవరు!?

ముంబైలోని మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ విల్లాను హీరో సచిన్ జోషికి ఎస్‌బిఐ విక్రయించింది. ఈ అమ్మకం విషయాన్ని ఎస్‌బిఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య ధ్రువీకరించారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: వేల కోట్ల రూపాయల రుణ ఎగవేతకు పాల్పడి బ్యాంకులకు పంగనామం పెట్టిన విజయ్ మాల్యా ఆస్తుల విక్రయం కొనసాగుతోంది. వేలంలో కింగ్ ఫిషర్ ఆస్తులను ఎవరూ కొనడానికి ముందు రాకపోయినా.. వ్యక్తిగత సంప్రదింపుల ద్వారా ఎస్‌బిఐ ఆస్తుల విక్రయాన్ని పూర్తి చేస్తోంది.

తాజాగా ముంబైలోని మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ విల్లాను హీరో సచిన్ జోషికి ఎస్‌బిఐ విక్రయించింది. ఈ అమ్మకం విషయాన్ని ఎస్‌బిఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య ధ్రువీకరించారు. చివరిసారి వేలం నిర్వహించడానికి దక్కిన రూ.73కోట్ల ధర కన్నా ఎక్కువే వెచ్చింది సచిన్ జోషి దీన్ని సొంతం చేసుకున్నారు.

Vijay Mallya's Kingfisher Villa sold to actor-businessman Sachiin Joshi

కాగా, రుణాల రికవరీలో భాగంగా మాల్యా ఆస్తులను బ్యాంకులు వేలం వేస్తున్న సంగతీ తెలిసిందే. అందులో భాగంగా కింగ్ ఫిషర్ విల్లాను ఎస్‌బిఐ వేలం వేసింది. అయితే వేలంలో కొనడానికి ఎవరూ ముందుకురాకపోవడంతో సంప్రదింపుల ద్వారా సచిన్ జోషికి ఎస్‌బిఐ దీన్ని అమ్మేసింది. అంతకుముందు దీని ధరను రూ.85కోట్లకు నిర్ణయించగా.. ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో రూ.81కోట్లకు, ఆపై రూ.73కోట్లకు ధర తగ్గించారు.

కండోలిమ్‌లో అరేబియా సముద్రానికి ఎదురుగా ఈ కింగ్ ఫిషర్ విల్లా ఉంది. ఇప్పుడీ విల్లా సచిన్ జోషి సొంతమైంది. జేఎంజే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైస్ చైర్మన్ హోదాలో జోషి ఫిట్ నెస్ సెంటర్ల నుంచి హెల్త్ స్పేస్ వరకు పలు రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ లలో పలు చిత్రాల్లో ఆయన నటించారు.

English summary
Vijay Mallya's famous Kingfisher Villa has finally been sold. After failing to find any bidders at multiple auctions+ , lenders have agreed to dispose the property through a negotiated sale to actor-businessman Sachiin Joshi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X