వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాల్యా ఇంట్లో గోల్డెన్ టాయిలెట్! చూసి షాకయ్యా: రచయిత సంచలనం

|
Google Oneindia TeluguNews

ముంబై: సుమారు 10వేల కోట్లకుపైగా రుణాలు ఎగ్గోట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా గురించి రచయిత, ప్రొఫెసర్‌ జేమ్స్‌ క్రాబ్‌ట్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్‌లో ఉండగా మాల్యాను కలవడానికి జేమ్స్‌ వెళ్లినప్పుడు ఆయనకు కనిపించిన దృశ్యాలు షాక్‌కు గురిచేశాయట. ఆ విషయం గురించి ఆయన తాజాగా వెల్లడించారు.

'లండన్‌లోని మాల్యా ఉంటున్న భవంతిలో ఆయనతో నాలుగు గంటలు గడిపే అవకాశం వచ్చింది. నేను అక్కడికి వెళ్లినప్పుడు ఆయన ఎంతో బాధపడుతున్నట్లు కనిపించారు. అప్పుడు ఆయన మద్యం సేవిస్తూ ఉన్నారు. ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత మాల్యా అనుమతితో అక్కడున్న వాష్‌రూమ్‌లోకి వెళ్లాను. అక్కడ ఉన్న గోల్డెన్‌ టాయిలెట్‌ చూసి ఆశ్చర్యపోయాను' అని జేమ్స్ వెల్లడించారు.

Vijay Mallyas London manor has a gold toilet, reveals author James Crabtree

అంతేగాక, 'బంగారంతో చేసిన రిమ్‌, మూత కూడా ఉంది. అరె! ఇక్కడ గోల్డెన్‌ టిష్యూ పేపర్‌ కూడా ఉంటే బావుండని అనుకున్నాను. దానికి బదులుగా అక్కడ తెల్లటి, మెత్తనైన టవల్స్‌ ఉన్నాయి. అక్కడ వీటన్నింటినీ చూసి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. టాయిలెట్‌ను మెయింటెన్‌ చేసే తీరును బట్టి ఎదుటి వాళ్ల గురించి చెప్పేయవచ్చు.' అని జేమ్స్ వ్యాఖ్యానించారు.

ఇటీవల జేమ్స్‌ భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఈ వివరాలు తెలిపారు. ముంబైలోని ఓసమావేశంలో పాల్గొన్న సందర్భంగా విజయ్‌ మాల్యా గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం జేమ్స్ చెప్పిన మాటలతో మాల్యా తన జీవితాన్ని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన మాల్యా.. తన విలాసాలను మాత్రం వదులుకోవడం లేదన్నమాట.

English summary
You can tell a lot about a man by the company he keeps and sometimes even by his washroom. James Crabtree, author and associate professor at the Lee Kuan Yew School, insists that to get to know people better, always visit their toilet. He speaks from experience; Crabtree still vividly remembers Vijay Mallya’s standout bathroom when he visited him at his London manor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X