వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిక్కర్ స్కాంలో తొలి అరెస్ట్: సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగిన లిక్కర్ స్కాం కేసులో తొలి అరెస్ట్ జరిగింది. ముందు కేసు న‌మోదు చేసిన సీబీఐ అధికారులు.. మంగ‌ళ‌వారం 'ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్' సంస్థ మాజీ సీఈఓ విజ‌య్ నాయ‌ర్‌ను అరెస్ట్ చేశారు. ఇతను మంత్రి మనీశ్ సిసోడియా సన్నిహితుడని తెలుస్తోంది. ఇతనిని విచారిస్తే మరిన్ని నిజాలు తెలిసే అవకాశం ఉంది.

ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో సేవ‌లు అందిస్తున్న ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్ కంపెనీ ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిందని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సంస్థకు ఇదివరకు సీఈఓగా ఉన్న విజ‌య్ నాయ‌ర్‌ను కేసులో ఐదో నిందితుడిగా సీబీఐ అధికారులు చేర్చారు.కేసు ద‌ర్యాప్తులో భాగంగా విజ‌య్ నాయ‌ర్‌కు చెందిన కీల‌క ఆధారాలు ల‌భించ‌డంతో మంగ‌ళ‌వారం ముంబైలో ఉన్న ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు.

Vijay Nair arrested by CBI in excise policy case

అక్కడ అదుపులోకి తీసుకుని ఢిల్లీకి త‌ర‌లించారు. నాయర్ ఇళ్లు, కార్యాలయాల వద్ద ఇదివరకు ఈడీ కూడా సోదాలు నిర్వహించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో నాయర్ ముఖ్య కుట్రదారు అని సీబీఐ భావిస్తోంది. గతనెల 21వ తేదీన సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీచేసింది. అందులో 8 మంది ఉండగా.. వారిలో విజయ్ నాయర్ ఒకరు. అయితే రైడ్స్ నిర్వహించే సమయంలో నాయర్ అప్పటికే ఎస్కేప్ అయ్యారు.

తాను ఎక్కడికి పారిపోలేదని విజయ్ నాయర్ తెలిపారు. కొన్ని పనుల వల్ల మాత్రమే విదేశానికి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. సీబీఐ అధికారులకు టచ్‌లో ఉన్నానని.. విచారణకు సహకరిస్తున్నానని తెలిపారు.

English summary
Vijay Nair has been arrested by the CBI in an excise policy case. first arrest by the CBI in this case. He is the former CEO of the entertainment and event media company Only Much Louder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X