వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ కొత్త సీఎంగా 'విజయ్ రూపానీ'

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్ : అనూహ్య పరిణామాల మధ్య ఖాళీ అయిన గుజరాత్ సీఎం పీఠం ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. రేసులో చాలా పేర్లు వినిపిస్తున్నా.. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతోన్న విజయ్ రూపాని పేరు కొత్త సీఎంగా ఖరారైంది. అలాగే డిప్యూటీ సీఎంగా మరో మంత్రి నితిన్ భాయ్ పటేల్ ను కేంద్ర వర్గాలు ఖరారు చేశాయి.

కేంద్ర అధికార వర్గాలకు, రాష్ట్ర ఎమ్మెల్యేలకు మధ్య కీలక భేటీ జరగబోతున్న నేపథ్యంలో.. సీఎం, డిప్యూటీ సీఎంలు గా విజయ్ రూపానీ, నితిన్ భాయ్ పటేల్ పేర్లు ఖరారు కావడం గమనార్హం. ఇకపోతే ఆనందీబెన్ కేబినెట్ లో పనిచేసిన మంత్రుల్లో విజయ్ రూపానీ ఒక్కరే ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపిన నేత కావడం విశేషం.

vijay rupani is the new cm for Gujarat

61 ఏళ్ల విజయ్ రూపానీ ఏబీవీపీ నేతగా, ఆర్ఎస్ఎస్ ప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతర కాలంలో రాజ్ కోట్ కార్పోరేటర్ గా, మేయర్ గా.. రాజ్యసభ ప్రతినిధిగా పలు పదవీ బాధ్యతలు చేపట్టారు.

English summary
The central bjp has decided vijay rupani is the new cm for Gujarat state. Nitinbhai patel was the new deputy cm for Gujarat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X