వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ పెట్టడం ఆత్మహత్యతో సమానం: హీరో విజయ్‌కి తండ్రి హితబోధ

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పార్టీల పరిస్థితులను గమనిస్తే ప్రస్తుతం కొత్త పార్టీ పెట్టడమనేది ఆత్మహత్యతో సమానమని తమిళ హీరో విజయ్‌కి తండ్రి ఎస్‌ఎ చంద్రశేఖర్‌ హితబోధ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో అభిమానులుండడం వారంతా రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తీసుకురావడంతో నటుడు విజయ్‌కి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో తండ్రి ఆ సలహా ఇచ్చారు.

విజయ్ గత కొంత కాలంగా అడపాదడపా రాజకీయ పార్టీపై దృష్టి సారిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా విజయ్ రాజకీయ ప్రయోజనాలను ఆశించే మక్కల్ ఇయక్కం పేరుతో ఒక సంఘాన్ని నెలకొల్పారు. ఆ తరువాత రాజకీయల్లోకి రావడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ ప్రయత్నంలో కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని కలిసి చర్చించడం, డీఎంకే పార్టీతో సన్నిహితంగా మెలగడం వంటివి చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్నారు.

Vijay's Father Warns Him Against Entering Politics!

ఇటీవల శ్రీలంక ప్రభుత్వం అరెస్టు చేసిన జాలర్ల విషయంలో జోక్యం చేసుకుని ప్రధాని నరేంద్రమోడీకి తన కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. దీంతో ఆయన బీజేపీలో చేరనున్నారనే వార్తలు వెల్లువెత్తాయి. వాటిని నిజం చేస్తున్నారా అనేట్లు నూతన సంవత్సరం సందర్భంగా జనవరిలో సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో తన తండ్రి ఎస్‌ఎ చంద్రశేఖర్‌తో సంప్రదించారని అంటున్నారు.

అందుకాయన ప్రస్తుత పరిస్థితుల్లో సొంతంగా పార్టీ పెట్టడం ఆత్మహత్యతో సమం అంటూ హితబోధ చేశారని ఆయన చెప్పినట్లు సమాచారం. పొరపాటున కూడా పార్టీ పెట్టవద్దని ఆయన చెప్పారని అంటున్నారు. మరికొన్నేళ్లు ఓపిక పట్టు, ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆలోచిద్దాం సలహా ఇచ్చారని కోలీవుడ్ వర్గాల సమాచారం. విజయ్ తండ్రి మాట వింటారని అంటున్నారు. సమీప భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తాజాగా చెబుతున్నారు.

English summary
There have been talks about Vijay's interest to serve the people of Tamil Nadu using politics as a base but the actor himself has denied it on several occasions. But now the latest buzz is that Vijay's father and a veteran director SA Chandrasekhar has advised Vijay not to join politics at the moment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X