వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయకాంత్ దారిలోకి.. బిజెపి ఆశ, కెప్టెన్ భార్య సిద్ధం

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని డిఎండికె అధినేత విజయకాంత్ నిర్ణయించుకోవడం సొంత పార్టీ సీనియర్లకు కూడా రుచించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి పలువురు సీనియర్ నేతలు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

తమిళనాడులో విజయకాంత్ పార్టీకి అటు ఇటుగా 8 శాతం ఓట్లు దక్కుతాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనతో పొత్తు కోసం డిఎంకె, బిజెపి పార్టీలు ఉవ్వీళ్లూరాయి. చివరకు డిఎంకెతో పొత్తు కుదురుతుందని అందరూ భావించారు.

కానీ విజయకాంత్ అందరికీ షాకిస్తూ... ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే, ఒంటరి పోరుతో లాభం లేదని, సొంత పార్టీలోని సీనియర్లే పెదవి విరుస్తున్నారు. మరోవైపు విజయకాంత్ ఒంటరి పోరు అని చెప్పినప్పటికీ బిజెపి ఇప్పటికీ తనవంతు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

Vijayakanth's decision to contest TN polls alone likely to be a gamechanger

విజయకాంత్‌తో పొత్తుపై బిజెపి మాత్రం ఇంకా ఆశల పల్లకిలోనే ఉంది. ఎలాగైనా కెప్టెన్‌ తమను విడిచిపోరని భావిస్తోంది. తీరా తమ దారికి రాకపోతే.. ఆయన దారిలో నడిచేందుకు కూడా బిజెపి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజా సంక్షేమ కూటమి కూడా అలాంటి ఆలోచనల్లోనే ఉంది.

తాజాగా జరిగిన సమావేశంలో కూడా విజయకాంత్‌ తప్పకుండా తమతో కలసి నడుస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల్లోకి వెళ్లి సీట్ల కోసం చేతులు కట్టుకోవడం కన్నా కెప్టెన్‌తో వెళ్తే కాస్త స్వేచ్ఛ ఉంటుందన్న భావనలో ప్రజాసంక్షేమ కూటమి ఉన్నట్లు తెలుస్తోంది.

2006 ఎన్నికల తరుణంలో డిఎండికెకు ఉన్న ఓటు బ్యాంకు దృష్ట్యా ఇప్పుడు ఇతర పార్టీలు ఆయనపై ఆశలు పెంచుకుంటున్నాయి. అంతేకాకుండా 2011 ఎన్నికల్లో అన్నాడిఎంకె విజయంలోనూ విజయకాంత్ పార్టీ ప్రభావం ఉందని కూడా గతంలో కొన్ని సర్వేలు కూడా తేల్చిచెప్పాయి.

విజయకాంత్‌తో కూటమికి సంబంధించి ఇప్పటికే ప్రకాశ్‌ జవదేకర్‌ అతనితో కలసి ఓమారు చర్చలు జరిపారు. విజయకాంత్‌ ప్రకటన చేసిన తర్వాత కూడా వారు విజయకాంత్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఆయన్ను ఎలాగైనా నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో ప్రకాశ్‌ జవదేకర్‌ మరోసారి విజయకాంత్‌తో చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. ఈ భేటీ తరుణంలో బిజెపి తమిళనాడు విభాగ ఇంఛార్జ్ మురళీధరరావు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ప్రేమలత కూడా బిజెపిలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో జరుగనున్న ఇరుపార్టీల భేటీతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. అయితే, విజయకాంత్ ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు గెలుచుకునే ఆవకాశాలు ఉండవని చాలామంది భావిస్తున్నారు. అయితే ఒంటరిగా ఎక్కువ సీట్లు గెలుచుకొని కింగ్ మేకర్ కావాలని విజయకాంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Vijayakanth's decision to contest TN polls alone likely to be a gamechanger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X