వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం సిద్దూ మీద రాసలీలల సీడీ విజయలక్ష్మి పోటీ, మాజీ మంత్రికి చాలెంజ్, బెదిరింపులు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

సీఎం మీద పోటీ చెయ్యకూడదని తనని బెదిరిస్తున్నారు : విజయలక్ష్మి

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద మాజీ మంత్రి రాసలీలల సీడీ బాధితురాలు పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. రాసలీలల సీడీ విషయంలో మాజీ మంత్రి హెచ్.వై. మేటీకి క్లీన్ చిట్ ఇచ్చిన సీఎం సిద్దరామయ్య మీద ప్రతీకారం తీర్చుకుంటానని బాధిత మహిళ విజయలక్ష్మి సరగుర చాలెంజ్ చేశారు. సీఎం మీద పోటీ చెయ్యకూడదని తనని బెదిరిస్తున్నారని విజయలక్ష్మి మీడియాకు చెప్పారు.

బాదామిలో సీఎం మీద పోటీ

బాదామిలో సీఎం మీద పోటీ

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బాగల్ కోటే జిల్లాలోని బాదామి శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడం దాదాపు ఖరారు అయ్యింది. బాదామి శాసన సభ నియోజక వర్గం నుంచి సీఎం సిద్దరామయ్య మీద పోటీ చెయ్యడానికి తాను సర్వం సిద్దం చేసుకున్నానని రాసలీలల సీడీ బాధితురాలు విజయలక్ష్మి మీడియాకు చెప్పారు.

దెబ్బకు మంత్రి పదవి !

దెబ్బకు మంత్రి పదవి !

కర్ణాటక మంత్రిగా పని చేసిన హెచ్.వై. మేటీ విజయలక్ష్మి కి మాయ మాటలు చెప్పి ఆమెతో రాసలీలలు సాగించారని ఓ సీడీ గతంలో విడుదలైయ్యింది. రాసలీలల ఆరోపణలు వచ్చిన సమయంలో హెచ్.వై. మేటీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

 రాసలీలల సీడీకి ప్రతీకారం

రాసలీలల సీడీకి ప్రతీకారం

హెచ్.వై. మేటీ బాగల్ కోటే ఎమ్మెల్యేగా ఉన్నారు. బాగల్ కోటే నియోజక వర్గంలో హెచ్.వై మేటీ మీద తాను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని విజయలక్ష్మి ప్రకటించారు. తనను మోసం చేసి, తన జీవితాన్ని నాశనం చేసిన మాజీ మంత్రి హెచ్.వై. మేటీ మీద ప్రతీకారం తీర్చుకుంటానని విజయలక్ష్మి అన్నారు.

ఒత్తిడి చెయ్యలేదు

ఒత్తిడి చెయ్యలేదు

బాదామి శాసన సభ నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య మీద పోటీ చెయ్యాలని, బాగల్ కోటే శాసన సభ నియోజక వర్గంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హెచ్.వై. మేటీ మీద పోటీ చెయ్యాలని తన మీద ఎవ్వరూ ఒత్తిడి చెయ్యలేదని, తనను ఎవ్వరూ ప్రలోభపెట్టలేదని విజయలక్ష్మి స్పష్టం చేశారు.

బెదిరిస్తున్నారు

బెదిరిస్తున్నారు

సీఎం సిద్దరామయ్య, మాజీ మంత్రి హెచ్.వై. మేటీ మీద పోటీ చెయ్యరాదని తనకు బెదిరింపులు వస్తున్నాయని విజయలక్ష్మి ఆరోపించారు. అయితే ఎలాంటి బెదిరింపులకు తాను భయపడనని, బాదామి నియోజక వర్గంలోని కురబ వర్గీయులు తనకు మద్దతు ఇస్తారని నమ్ముతున్నానని విజయలక్ష్మి మీడియాకు చెప్పారు. రాసలీలల సీడీ విడుదలైన తరువాత విజయలక్ష్మి ఓ సారి ఆత్మతహత్యాయత్నం చేసి ప్రాణాలతో బయటపడ్డారు.

English summary
Karnataka Assembly Elections 2018: Former minister HY Meti CD victim Vijayalakshmi Saragura announced that, she will contest for assembly elections against Siddarmaiah in Badami constituency, Bagalkot district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X