వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళతో రాత్రిపూట విజయశాంతి రహస్య భేటీ, ఏం జరగబోతోంది?

ప్రముఖ సినీనటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే చీఫ్ వీకే శశికళతో రహస్యంగా సమావేశమయ్యారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ సినీనటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే చీఫ్ వీకే శశికళతో రహస్యంగా సమావేశమయ్యారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన టీటీవీ దినకరన్ సోమవారం చిన్నమ్మతో సమావేశమై సుదీర్ఘ మంతనాలు జరిపిన విషయం తెలిసిందే.

శశికళను కలిసిన అనంతరం దినకరన్ వెలుపలికి రాగా, రాత్రి 7 గంటల ప్రాంతంలో విజయశాంతి.. శశికళతో సమావేశమయ్యారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన వ్యక్తిని ఆమె జైలుకెళ్లి మరీ కలిసిరావడం.. అదీ తమిళనాట ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

అది జైలా? రిసార్టా?

అది జైలా? రిసార్టా?

నిజానికి సాయంత్రం 5 గంటల తర్వాత సెంట్రల్ జైల్లోకి ఎవరినీ అనుమతించరు. అలాంటిది వీరికి ప్రత్యేక వెసులుబాటు కల్పించడంపై విమర్శలు వస్తున్నాయి. శశికళ జైల్లో ఉన్నట్టు కనిపించడంలేదనీ... రిసార్టులో మాదిరి సకల సౌకర్యాలు అందుకుంటున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. సామాన్యుడికో న్యాయం, రాజకీయ నేతలకో న్యాయమా? అంటూ ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు.

అప్పుడూ చిన్నమ్మకే మద్దతు...

అప్పుడూ చిన్నమ్మకే మద్దతు...

దివంగత ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత సీఎం పీఠం కోసం పన్నీర్‌సెల్వం, శశికళ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీని శశికళే నడిపించాలని, జయలలిత వారసత్వం అందిపుచ్చుకోవాలంటే ముఖ్యమంత్రిగా చిన్నమ్మకే అవకాశం ఇవ్వాలని విజయశాంతి పోయెస్ గార్డెన్‌కి వెళ్లి మరీ మద్దతు తెలిపారు.

ఏం మాట్లాడుకున్నారో?

ఏం మాట్లాడుకున్నారో?

అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శశికళ జైలుకు వెళ్లాల్సి రావడంతో తమిళనాట రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఇటీవల జయ నియోజక వర్గం ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఈసీ వాయిదా వేయడం... పార్టీ గుర్తు కోసం భారీగా లంచం ఆశ చూపిన దినకరన్ అరెస్ట్ కావడం... పన్నీర్, పళని వర్గాలు ఒక్కటయ్యేందుకు చర్చలు జరపడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే విజయశాంతి పరప్పన అగ్రహారం జైల్లో నిన్న రాత్రి శశికళను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

విజయశాంతికి మంచిదా?

విజయశాంతికి మంచిదా?

గతంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వర్తమానంలో శశికళ దోషి. ప్రస్తుతం జైలు శిక్ష్ అనుభవిస్తున్న నేరస్థురాలు. శశికళలాంటి నేరస్థులతో రహస్యంగా సమావేశం కావడం విజయశాంతికి మంచిదేనా? ఇలాంటి చర్యలు విజయశాంతి భావి రాజకీయ జీవితానికే ప్రమాదం కూడా కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ పరంగా ఇది విజయశాంతికి ఎలాంటి లాభ నష్టాల్ని చేకూరుస్తుందో వేచి చూడాల్సిందే!

English summary
Actress, Telangana Congress Party Leader Vijayasanthi secretly met AIADMK Chief VK Sasikala here on Monday Night at Parappana Agraharam Jail. Before this incident TTV Dinakaran also met Sasikala in Jail. Vijayasanthi's Meeting with Sasikala was critisized by some people in Social Media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X