వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికార్ టార్గెట్ మోడీ, బిర్యానీ కోసం ఎస్సైపై దాడి: టెర్రరిస్ట్‌లు వీరే (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిన్నప్పటి నుండి మతోన్మాద విషబీజాలు మనసులో నాటుకుపోయిన వికారుద్దీన్.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్‌కు మకాం మార్చి, అక్కడున్నప్పుడే టీజీఐ సంస్థను ఏర్పాటు చేశాడు.

మోడీని హత్య చేయాలని పథకం వేశాడు. అప్పట్లో అహ్మదాబాదులోని రసోల్ బాగ్‌కు వచ్చిన మోడీపై పిస్తోలుతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే మోడీకి జడ్ ప్లస్ భద్రత ఉండటంతో వెనక్కి తగ్గారు. కాగా, వికారుద్దీన్ సహా ఐదుగురి మృతదేహాలను తీసుకు వెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు.

దీని పైన సీబీఐ దర్యాఫ్తు జరిపించాలని, కేసు విచారణ 90 శాతం పూర్తయిందని, వికారుద్దీన్ అండ్ గ్యాంగ్ జైలు నుండి బయటపడుతుందని భావించి పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిష్పాక్షిక దర్యాఫ్తు జరిపితేనే తీసుకు వెళ్తామని చెబుతున్నారు.

పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాది అంజద్

పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాది అంజద్

వికారుద్దీన్‌కు ఏడేళ్ల నేర చరిత్ర ఉంది. మోడీతో పాటు గుజరాత్‌లో బీజేపీ, వీహెచ్‌పీ నేతల హత్యకు పథకాలు పన్నాడు. ఏకే 47 కొనేందుకు దోపిడీలు చేసేవాడు. పోలీసుల పైన నరనరాన విద్వేషం ఉంది. వేసిన వేషం వేయకుండా అవసరానికో పేరు తగిలించుకుని, విద్యార్థి దశలోనే ఉగ్ర వాద విషబీజాలను మనసులో నాటుకుని, సొంత సైన్యం ఏర్పాటు చేసుకున్న నేరచరిత్ర వికారుద్దీన్‌‌ది.

పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాది హనీఫ్

పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాది హనీఫ్

వికారుద్దీన్‌ గురించి తొలిసారి 2007లో వినిపించింది. అతడు ముందుగా దర్స్‌గా జిహాద్‌-ఎ-షహదత్‌ (డీజేఎస్‌)లో చేరాడు. అలీఖాన్‌గా పేరు మార్చుకున్నాడు. డీజేఎస్‌ కార్యకలాపాల్లో భాగమయ్యేవాడు. బాంబుల తయారీపై అవగాహన పెంచుకున్నాడు. సొంతంగా తెహ్రీక్‌-ఎ-గులా-ఇ-ఇస్లాం(టీజీఐ)ను స్థాపించాడు.

పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాది ఇజార్

పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాది ఇజార్

డీజేఎస్‌లో తనతో పనిచేసిన అంజద్‌, అర్షద్‌, జోబేదాలను చేర్చుకుని, టీజీఐద్వారా హైదరాబాద్‌ యువతను జిహాద్ వైపు మళ్లించే శిక్షణ చేపట్టాడు. ఇందుకు రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో అనం తగిరి అటవీ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. యువకులను చాటుమాటుగా అక్కడికి రప్పించుకుని ఉగ్రవాద వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న సాహిత్యాన్ని వారికి వినిపించేవాడు.

పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాది వికారుద్దీన్

పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాది వికారుద్దీన్

అలాగే ఉత్తరప్రదేశ్‌ నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలతో తనదైన ఫైరింగ్‌ జోన్‌లో శిక్షణ ఇచ్చేవాడు. సంస్థ కార్యకలాపాలకోసం దోపిడీ లకు దిగాడు. ముందుగా తుపాకుల కొనుగోలు కోసం డాక్టర్‌ హనీఫ్‌, అతని సోదరుడు సులేమాన్‌ ఆర్థిక సహాయం చేశాడు. ఆ తుపాకులతో శివార్లలో ఐదు ఈ-సేవా కేంద్రాలపై దాడి చేసి, రూ.14లక్షలు కొల్లగొట్టి ఆయుధాలను సమకూర్చుకున్నారు.

పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాది జకీర్

పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాది జకీర్

2007లో పోలీసులపై దాడికి పన్నిన వ్యూహం విఫలం కావడంతో వికారుద్దీన్‌, హనీఫ్‌, సులేమాన్‌ అహ్మదాబాద్‌ పారిపోయారు. అక్కడి నుంచే టీజీఐ సేవలను విస్తృతం చేసి, చోరీలకు పాల్పడ్డారు. వికారుద్దీన్‌కు సిమితోనేగాక ఐఎస్‌ఐ, లష్కరేవంటి ఉగ్ర సంస్థలతోనూ సత్సంబంధాలున్నాయి.

వికారుద్దీన్

వికారుద్దీన్

ముషీరాబాద్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న డాక్టర్‌ హనీఫ్‌ ఆర్థిక సాయం చేసేవాడు. ఇజహద్‌ ఖాన్‌ నుంచి వికార్‌ ఏడు పిస్టళ్లను కొనుగోలు చేశాడు. దీంతో అతడో తుపాకీని ఉచితంగా ఇచ్చాడు.

 వికారుద్దీన్

వికారుద్దీన్

అలా వాళ్ల మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఇలా పరిచయమైన ప్రతి ఒక్కరినుంచి ఏదోలా సాయం పొందేవాడు. దోపిడీలు చేసినా, పోలీసులపై కాల్పులకు దిగినా వికారుద్దీన్‌ వేషాలు మార్చేవాడు.

వికారుద్దీన్

వికారుద్దీన్

మూడేళ్లపాటు వికారుద్దీన్‌ దొరక్కపోవడంతో చివరకు పోలీసులు రూ.5 లక్షల రివార్డునూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌కు చెందిన హనీఫ్‌ ముషీరాబాద్‌లో ఓ క్లినిక్‌ నడిపేవాడు. వికార్‌కు సహాయపడేవాడు.

వికారుద్దీన్

వికారుద్దీన్

హనీఫ్‌తో దగ్గర సంబంధాలున్న వ్యక్తిని పోలీసులు చోరీ కేసులో విచారించగా హనీఫ్‌ సంగతి బయటపడింది. పోలీసులు హనీఫ్‌ను అదుపులోకి తీసుకోవడంతో వికారుద్దీన్‌ కార్యకలాపాలు బయటకు వచ్చాయి.

 వికారుద్దీన్

వికారుద్దీన్

వికారుద్దీన్ బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ వెళ్లి పూర్తి స్థాయిలో ఉగ్రవాద శిక్షణ తీసుకుని 2008 డిసెంబర్‌లో హైదరాబాద్‌ వచ్చాడు.

 వికారుద్దీన్

వికారుద్దీన్

వికారుద్దీన్‌ నేరచరిత్ర.. 2003 జనవరి 16న వికార్‌, ఒమర్‌ షమీం మలక్‌పేట యశోద ఆస్పత్రివద్ద ఈ సేవాకేంద్రంలో రూ.2.5లక్షలు దోపిడీ చేశారు. 2007లో బంజారాహిల్స్ ఈ సేవా కేంద్రం వద్ద దోపిడీ, బైక్ దోపిడీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో దోపిడీ వేర్వేరు సమయాల్లో చేశారు.

 వికారుద్దీన్

వికారుద్దీన్

డిసెంబర్‌ 26న వికారుద్దీన్‌, ఒమర్‌ ఈ సేవా కేంద్రంలో రూ.1.62 లక్షలు దోచుకున్నారు. వీళ్లు 315ఎంఎం కాలిబర్‌ సింగిల్‌ షాట్‌ కట్టా పిస్టల్‌, 38 ఎంఎం రివాల్వర్ ఇలా ఎన్నో పిస్టళ్లు, తుపాకులు కొనుగోలు చేశారు.

 వికారుద్దీన్

వికారుద్దీన్

2009 మే 18న ఫలక్‌నుమా స్టేషన్‌ కానిస్టేబుల్‌ రాజేంద్రప్రసాద్‌, హోంగార్డు బాలాస్వామిలపై పట్టపగలు కాల్పులకు దిగడంతో బాలస్వామి మరణించాడు. 2010 మే 14న శాలిబండలో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ రమేష్‌ను హత్య చేశాడు. 2010 జూలై 14న వికారుద్దీన్‌ గ్యాంగ్‌ను నగర పోలీసులు అరెస్టు చేశారు.

 వికారుద్దీన్

వికారుద్దీన్

వికారుద్దీన్ బిర్యానీ ప్రియుడు, పోలీసులు అంటే అసలు పడదు. హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. వరంగల్ కేంద్ర కారాగారంలో పలుమార్లు బిర్యానీ కోసం పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

 వికారుద్దీన్

వికారుద్దీన్

కోర్టుకు తీసుకు వెళ్లేటప్పుడు మాత్రం బిర్యానీ తినిపించకపోతే పోలీసులను ముప్పుతిప్పలు పెట్టేవాడు.య బిర్యానీ కోసం మల్కాజిగిరి సీఐ, వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎస్సైపై దాడి చేశాడు.

English summary
Vikaruddin, aides wanted to kill Narendra Modi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X