• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిక్ టాక్ లేడీ ఫేం రచ్చ, బహిష్కరించండి, ఆర్మీ భర్త మృతి, అడిగేవాళ్లు లేరని అసభ్యంగా, బూతులు, కేసు !

|

చెన్నై: మిలటరీలో ఉద్యోగం చేస్తున్న భర్త చనిపోవడంతో అడిగేవాళ్లు లేరనే గర్వంతో అసభ్యకరమైన టిక్ టాక్ వీడియోలతో యువకులను పరిచయం చేసుకుని అసభ్యంగా ప్రవర్తించి సాటి యవతీ యువకులను నాశనం చేస్తున్నదని, వెంటనే ఆమెను, ఆమెకు సహకరిస్తున్న వారిని మా గ్రామం నుంచి బహిష్కరించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. టిక్ టాక్ వీడియోల్లో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా నోటితో చెప్పలేని బాషతో అందర్నీ రెచ్చగొట్టడంతో మా ప్రాంతంలోని మహిళలకు గౌరవం లేకుండా పోయిందని, మమ్మల్ని బూతులు తిడుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు CSR కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

లవ్ మ్యారేజ్, టిక్ టాక్ మోజులో అక్రమ సంబంధం, భర్త నైట్ డ్యూటీలు,భార్యకు అదే పని,ఫోన్ ఎంగేజ్, క్లోజ్

టిప్ టాప్ లేడీ టిక్ టాక్ వీడియోలు

టిప్ టాప్ లేడీ టిక్ టాక్ వీడియోలు

తమిళనాడులోని థేని జిల్లాలోని నాగలాపురం ప్రాంతంలో ఆర్. సుగంతి అనే మహిళ నివాసం ఉంటున్నది. సుంగతి ఆమె కుమార్తెతో కలిసి ప్రత్యేకంగా నివాసం ఉంటోంది. సుగంతికి టిక్ టాక్ వీడియోల పిచ్చి ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో సుగంతి చాల వరకు టిక్ టాక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

యువకులకు వల

యువకులకు వల

అందంగా ఉంటున్న సుగంతి ఖరీదైన లేటెస్ట్ అందమైన దుస్తులు వేసుకుని టిక్ టాక్ వీడియోల్లో నటించి వాటిని సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టు చెయ్యడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. సుగంతి టిక్ టాక్ వీడియోలకు ఫిదా అయిన కొందరు యువకులు ఆమెకు టచ్ లోకి వచ్చారు. సుగంతి అతి కొద్ది కాలంలోనే టిక్ టాక్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

యువకులతో అసభ్యంగా !

యువకులతో అసభ్యంగా !

టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన సుగంతితో కొందరు యువకులు అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టారు. అదే సమయంలో ఆ యువకులతో సుగంతి అసభ్యంగా, అభ్యంతరకరంగా, నోటితో చెప్పలేని మాటలతో మాట్లాడటం మొదలు పెట్టింది. ఆ సమయంలో కొందరు యువకులు సుగంతిని అమ్మనా బూతులు తిట్టారు.

మీ ఊరి మహిళలు అందరూ ఇంతేనా ?

మీ ఊరి మహిళలు అందరూ ఇంతేనా ?

సుంగతిని అమ్మనా బూతులు తిట్టిన కొందరు యువకులు పనిలోపనిగా నాగలాపురం మహిళలను నోటికి వచ్చినట్లు చెడ్గగా మాటలతో చెప్పలేని బూతులు తిట్టారు. ఈ వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగలాపురం ప్రాంతానికి చెందిన మహిళల కుటుంబ సభ్యులకు మండిపోయింది.

మీ చేత కాకపోతే చెప్పండి !

మీ చేత కాకపోతే చెప్పండి !

నాగలాపురం ప్రాంతానికి చెందిన మహిళలు, గ్రామస్తులు సుగంతి మీద మండిపడ్డారు. వెంటనే గ్రామం విడిచి వెళ్లిపోవాలని సుగంతికి చెప్పారు. అయితే మీ చేతనైయ్యింది మీరు చేసుకోండి, నేను ఇక్కడే ఉంటానని సుగంతి తేల్చిచెప్పింది. తరువాత గ్రామస్తులు పళనిచెట్టిపట్టి పోలీస్ స్టేషన్ ముట్టడించి వెంటనే సుగంతిని మా ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలని ధర్నాకు దిగారు. సుగంతి, ఆమెకు సహకరిస్తున్న నాగజ్యోతితో పాటు మరో ఇద్దరు మహిళలను గ్రామం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

భర్త లేడని కనికరం చూపిస్తే !

భర్త లేడని కనికరం చూపిస్తే !

సుగంతి భర్త మిలటరీలో ఉద్యోగం చేసేవాడు. అయితే సుగంతి భర్త మరణించాడు. కుమార్తెతో కలిసి సుగంతి నాగలాపురంలో నివాసం ఉంటున్నది. భర్త లేడని, ఒంటరిగా కుమార్తెతో కలిసి నివాసం ఉంటుంన్నదని, పోతేపోని అని సుగంతి మీద జాలి చూపిస్తే మా పరువు తీస్తోందని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫ్రెండ్ హత్యకు కుట్ర ?

ఫ్రెండ్ హత్యకు కుట్ర ?

పళనిచెట్టిపట్టి పోలీసులు కమ్యూనిటీ సర్వీస్ రిజిస్టర్ (CSR)కేసు నమోదు చేసి సుగంతిని విచారణ చేశారు. ఇదే సమయంలో టిక్ టాక్ వీడియో ఫ్రెండ్ ను సుగంతి హత్య చెయ్యడానికి ప్లాన్ వేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో నాగలాపురం మహిళలు షాక్ కు గురైనారు. మొత్తం మీద స్థానికులకు నిద్రలేకుండా చేస్తున్న టిక్ టాక్ ఫేం సుగంతిని పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.

English summary
Villagers want TikTok woman Suganthi to be sent out in Tamil Nadu. Madurai tik tok suganthi is reportedly planning to kill her tik tok friend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X