• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వర్సిటీలో గొడవ: విద్యార్థులు, జర్నలిస్టులకు గాయాలు, వర్సిటీకి సెలవులు, సీఎం యోగి సీరియస్

By Ramesh Babu
|

లక్నో: విద్యార్థినులపై లైంగిక వేధింపులు నేపథ్యంలో రెండు విద్యార్థి సంఘాల నడుమ జరిగన ఘర్షణ తీవ్ర స్థాయికి చేరి హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో బెనారస్ హిందూ యూనివర్సిటీ (బిహెచ్‌యు)లో శనివారం రాత్రి పోలీసులు జరిపిన లాఠీ చార్జీలో పలువురు విద్యార్థులతోపాటు ఒక మహిళ, ఇద్దరు జర్నలిస్టులు కూడా గాయపడ్డారు.

ఈ సంఘటనతో సోమవారం నుంచి అక్టోబర్ రెండు వరకు యాజమాన్యం యూనివర్సిటీకి సెలవులు ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సీరియస్ అయ్యారు. డివిజనల్ కమిషన్‌ను వివరణ కోరారు.

అసలేం జరిగిందంటే...

అసలేం జరిగిందంటే...

గురువారంనాడు యూనివర్సిటీలో ప్రాంగణంలోకి ఒక బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు మహిళా విద్యార్థులపై వేధింపులకు పాల్పడ్డారు. అయితే వీరికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆ ఆకతాయిలను నిరోధించలేదని విద్యార్థులు ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు యూనివర్సిటీలో పునరావృతం అవుతున్నా యాజమాన్యం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థి వర్గాల నడుమ ఘర్షణ..

విద్యార్థి వర్గాల నడుమ ఘర్షణ..

గురువారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఈవ్ టీజింగ్‌కు సంబంధించి రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీనికి సంబంధించి ఒక వర్గం శనివారం రాత్రి వైస్‌చాన్సలర్‌ను కలుసుకునేందుకు ఇంటికి వచ్చారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. ఇంతలోనే విద్యార్థుల వైపునుంచి రాళ్లదాడి జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.

జర్నలిస్టులపైనా దాడి..

జర్నలిస్టులపైనా దాడి..

పోలీసుల లాఠీచార్జిలో విద్యార్థులతోపాటు ఒక మహిళ, ఇద్దరు జర్నలిస్టులకు గాయాలయ్యాయి.

దీంతో జర్నలిస్టులపై పోలీసుల దాడికి నిరసనగా ఆదివారంనాడు ముఖ్యమంత్రి నివాసం వద్ద కొంతమంది విలేఖరులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్‌ను కలిసి జర్నలిస్టులపై జరిగిన దాడిపై దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

నేతల రంగ ప్రవేశం, ఎవరేమన్నారంటే..

నేతల రంగ ప్రవేశం, ఎవరేమన్నారంటే..

ఇలావుండగా విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి విపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారమని, ఇలా లాఠీలు ప్రయోగించడం మంచి పద్ధతి కాదని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఈ సంఘటనపై స్పందించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బిజెపి నినాదం ‘భేటీ బచావో, భేటీ పడావో' అంటే ఇదేనా అని ప్రశ్నించారు. మహిళా విద్యార్థులను వేధించిన వారిని శిక్షించకుండా, విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం ఏమిటని నిలదీశారు. జెడి(యు) సీనియర్ నేత శరద్ యాదవ్ మాట్లాడుతూ, ‘బిహెచ్‌యులో ఇలాంటి సంఘటన ఇంతవరకు జరగలేదని, విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం అంటే, అది వారి గొంతు నొక్కే ప్రయత్నమే..'నని తీవ్రంగా విమర్శించారు. ఈ సంఘటనను పార్లమెంటులో లేవదీస్తామని అన్నారు.

English summary
A number of students, including women, and two journalists were injured in a lathicharge by the police in the Banaras Hindu University (BHU) where a protest last night against an alleged eve- teasing incident turned violent. The violence erupted after some students, protesting against the incident on Thursday, wanted to meet the varsity's vice chancellor at his residence last night, according to the police and BHU sources. Security guards of the university stopped the students and informed the police, according to university sources. A BHU spokesperson said some students wanted to "forcibly" enter the VC's residence but they were stopped by the BHU security guards. Subsequently, there was stone pelting by "outsiders" who had joined the students, he said. The police baton charged the students in a bid to disperse them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X