వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ హింసాకాండ, ఎందుకు వైఎస్ జగన్, కేసీఆర్, యడియూరప్ప, పళనిస్వామి మౌనం, కేరళ సీఎం ఫైర్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ చెన్నై/ బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తున్న, వ్యతిరేకిస్తున్న వర్గాల మధ్య జరుగుతున్న హింసాకాండతో దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన హింసాకాండలో 32 మంది మృతి చెందారు. ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండ గురించి దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మౌనంగా ఉండటంతో ఆ రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నాయకులు విమర్శలు చెయ్యడానికి సిద్దం అయ్యారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఢిల్లీ అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని మలయాళీలను శాంతియుతంగా, క్షేమంగా ఉండాలని కేరళ సీఎం పనరయి విజయన్ మనవి చేశారు.

ఢిల్లీలో హింస, కర్ఫ్యూ, డోంట్ కేర్: బైక్ ల్లో అజిత్ ధోవల్ కాన్వాయ్ ఓవర్ టేక్, జై శ్రీరామ్, షాక్ !ఢిల్లీలో హింస, కర్ఫ్యూ, డోంట్ కేర్: బైక్ ల్లో అజిత్ ధోవల్ కాన్వాయ్ ఓవర్ టేక్, జై శ్రీరామ్, షాక్ !

 బీజేపీ నాయకుడే కారణం

బీజేపీ నాయకుడే కారణం

ఢిల్లీలో హింసకు కారణం అయిన బీజేపీ నాయకులు (కపిల్ మిశ్రా తదితరులు) ఇంకా బయట స్వేచ్చగా తిరుగుతున్నారని, అక్కడ జరుగుతున్న అల్లర్లలో అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఇంత హింస జరగడానికి కారణం అయిన బీజేపీ నాయకుల మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు ? అని కేరళ సీఎం పినరయి విజయన్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు.

శాంతియుతంగా ఉండాలి

శాంతియుతంగా ఉండాలి

ఢిల్లీ ప్రజలతో పాటు అక్కడ నివాసం ఉంటున్న మలయాళీలు శాంతిని కాపడటానికి ప్రయత్నించాలని కేరళ సీఎం పనిరయి విజయన్ మనవి చేశారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుంటేనే ఢిల్లీలో శాంతిభద్రతలు అదుపులోకి వస్తాయని, ఆదిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

 పుకార్లు వ్యాపించాయి

పుకార్లు వ్యాపించాయి

మత ఘర్షణల విషయంలో ఎక్కువగా పుకార్లు వ్యాపించడం వలనే ఢిల్లీలో ఈ రోజు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు ఢిల్లీలో శాంతిభద్రతలు కాపాడటానికి పని చెయ్యాలని, అక్కడి ప్రజలు ఇకనైనా శాంతియుతంగా జీవించడానికి అవకాశం కల్పించాలని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు.

తెలుగు సీఎంలు మౌనం !

తెలుగు సీఎంలు మౌనం !

ఢిల్లీలో జరుగుతున్న అల్లర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి (వైఎస్ జగన్), కే. చంద్రశేఖర్ రావ్ (కేసీఆర్) మౌనంగా ఉన్నారు. ఢిల్లీ అల్లర్ల విషయంలో సీఎంలు వైఎస్. జగన్, కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు అనే విషయం అర్థం కావడం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే సరైన సమయంలో ఈ విషయంపై స్పంధించాలని సీఎంలు వైఎస్. జగన్, కేసీఆర్ భావించారని సమాచారం.

అప్ప, ఎడప్పాడి విషయంలో ?

అప్ప, ఎడప్పాడి విషయంలో ?

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప జన్మదినవేడుకల్లో బిజీబిజీగా ఉన్నారు. కర్ణాటకలోని బీజేపీ నాయకులు సైతం సీఎం యడియూరప్ప బర్త్ డే వేడుకులు చేసుకుంటున్నారు. అయితే ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండ గురించి కర్ణాటక సీఎం యడియూరప్పతో పాటు ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు మౌనంగా ఉన్నారు. తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి సైతం ఢిల్లీ అల్లర్ల విషయంలో మౌనంగా ఉన్నారు. అయితే తమిళనాడులో ప్రతిపక్షనాయకుడు ఎంకే. స్టాలిన్, డీఎంకే పార్టీ నాయకులు ఢిల్లీ అల్లర్ల విషయంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకుల కారణంగా ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

English summary
The Kerala CM has also expressed concern the BJP leader who instigated the violence still walks free. AP CM YS Jaga, Telangana CM KCR, Karnataka BSY and Tamil Nadu CM E. Palanisamy silent. The violence in Delhi is the product of the Sangh Parivar’s misconception that such agitation can be defeated at streets, Kerala Chief Minister Pinarayi Vijayan said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X