వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్, పశ్చిమబెంగాల్ లో హింస..! పోలింగ్ కేంద్రంపై గ్రెనేడ్ దాడి..!!

|
Google Oneindia TeluguNews

జమ్ముకాశ్మీర్/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. పలు చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నా కశ్మీర్, పశ్చిమబెంగాల్ లలో హింస చోటుచేసుకుంది. కశ్మీర్ లోని ఉగ్రదాడి జరిగిన పుల్వామాలో (అనంతనాగ్ నియోజకవర్గం) ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా పుల్వామాలోని ఓ పోలింగ్ బూత్ పై ఆగంతుకులు గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఘటన నేపథ్యంలో, ఆ ప్రాంతంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దాడులు జరుగుతాయనే భయంలో ఇక్కడ ఏ పార్టీ నేతలు కూడా ప్రచారం నిర్వహించలేదు. మరోవైపు, ఇక్కడ ఓటింగ్ శాతం రెండంకెల శాతానికి చేరుకోకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఇక కోల్ కోతాలో సార్వత్రిక ఎన్నికల్లో పలు చోట్ల దాడులు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. పోలింగ్ సందర్భంగా పశ్చిమబెంగాల్ లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బారక్ పూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.

 Violence in Kashmir, West Bengal Grenade attack on polling center .. !!

దాడి అనంతరం ఆయన మాట్లాడుతూ... ఓటర్లతో తాను మాట్లాడుతుండగా తనపై టీఎంసీ వర్గీయులు దాడి చేశారని చెప్పారు. పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని తెలిపారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో టీఎంసీ మూకల దాడులకు అంతులేకుండా ఉందని మండిపడ్డారు. రక్తం కారుతున్న తన నోరే దీనికి నిదర్శనమని అర్జున్ సింగ్ చెప్పారు.

English summary
The fifth phase of the general election continues Monday in several states. In many parts of the country, violence continues in Kashmir and West Bengal. The polling is ongoing in Pulwama (Anantnag constituency) in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X