వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా దురాక్రమణపై భారత్ నిప్పులు.. గాల్వాన్‌లో ఘర్షణపై అధికారిక ప్రకటన.. మోదీ యాక్షన్ ప్లాన్..

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ వెంబడి) వెంబడి ఉద్రిక్తత మళ్లీ పెరగడం.. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో రెండు దేశాల సైనికులు ఘర్షణ పడటం, భారత్ వైపు కల్నల్ ర్యాంకు అధికారి, మరో ఇద్దరు జవాన్లు చనిపోయిన ఘటనలపై కేంద్రం ఘాటు స్పందించింది. సరిహద్దు స్టేటస్ కో ను మార్చాలనే దురుద్దేశంతోనే గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణకు ప్రయత్నించిందని, దాని పర్యవసానంగానే హింస చెలరేగిందని విదేశాంగ శాఖ తెలిపింది.

 నా కొడుకు దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది.. కన్నతల్లిగా బాధే కదా: కల్నల్ మాతృమూర్తి మంజుల నా కొడుకు దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది.. కన్నతల్లిగా బాధే కదా: కల్నల్ మాతృమూర్తి మంజుల

అందుకే గొడవ..

అందుకే గొడవ..

లదాక్ సరిహద్దులో భారీగా బలగాలను మోహరించి తరచూ కవ్వింపులకు దిగుతోన్న చైనాను కట్టడిచేసేక్రమంలో ఈనెల 6న కీలక చర్చలు జరిగాయి. సీనియర్ కమాండర్ల భేటీలో.. సరిహద్దు నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఆ క్రమంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు వెనక్కి తగ్గాలనే అంశాలపై కమాండర్ల స్థాయిలోనూ వరుసగా చర్చలు జరిగాయి. అయితే, కొన్ని ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లేందుకు నిరాకరించడం గొడవకు దారితీసింది.

ఆ రాత్రి ఏం జరిగిందంటే..

ఆ రాత్రి ఏం జరిగిందంటే..

‘‘సీనియర్ కమాండర్ల చర్చల్లో ఒప్పుకున్న దానికి విరుద్ధంగా చైనా కొన్ని కీలక ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లేందుకు బెట్టుచేసింది. వాటిలో గాల్వాన్ లోయ కూడా ఒకటి. డీఎస్కలేషన్ గా పిలిచే సైనిక ఉపసంహరణ ప్రక్రియకు విరుద్ధంగా చైనా.. సోమవారం రాత్రి భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించింది. అంతేకాదు, సరిహద్దులో స్టేటస్ కో ను చెరిపేసే యత్నం చేసింది. వాళ్లను అడ్డుకునే క్రమంలో ఘర్షణ తలెత్తింది'' విదేశాంగా శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.

వారి వల్లే హింస..

వారి వల్లే హింస..


గాల్వాన్ లోయలో భూభాగాన్ని ఆక్రమించి, వాస్తవ పరిస్థితిని మార్చేందుకు చైనా చేసిన దుస్సాహసం వల్లే అక్కడ హింస చెలరేగిందని, చైనా నోటితో చెబుతున్నట్లు నిజంగా శాంతికే కట్టుబడి ఉంటే ఈ పరిస్థితి తలెత్తకపోయి ఉండేదని ఎంఈఏ ప్రకటనలో పేర్కొంది. సరిహద్దు వివాదాన్ని శాంతియుత పంథాలోనే పరిష్కరించుకోవాలన్న విధానానికి భారత్ ఇప్పటికీ కట్టుబడి ఉందని, అయితే, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలో ఇంచు కూడా వెనుకడుగు వేయబోమని తేల్చిచెప్పింది.

ఇండియాదే తప్పు..

ఇండియాదే తప్పు..

భారత్, చైనా సరిహద్దులో ఘర్షణ కారణంగా సైనికులు చనిపోవడం 1975తర్వాత ఇదే తొలిసారి. సోమవారం రాత్రి గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న హింసకు చైనాయే బాధ్యత వహించాలని భారత్ పేర్కొనగా.. డ్రాగన్ మాత్రం తప్పంతా ఇండియాదేనంటూ ప్రకటనలు చేసింది. ఇండియన్ ఆర్మీ బలగాలు చైనా భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని, సరిహద్దులు మార్చేందుకు ప్రయత్నించాయని, ఆక్రమంలోనే హింస చోటుచేసుకందని చైనీస్ ఆర్మీ ఓ ప్రకటనలో ఆరోపించింది. గొడవలో చైనా వైపు ఐదుగురు సైనికులు చనిపోయినట్లు సమాచారం.

మోదీ యాక్షన్ ప్లాన్?

మోదీ యాక్షన్ ప్లాన్?

లదాక్ లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యాలు ఘర్షణ పడటం, మనవైపు ముగ్గురు, అటువైపు ఐదుగురు చనిపోయిన ఘటనల్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మంగళవారం ఉదయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ తదుపరి యాక్షన్ ప్లాన్ పై సమాలోచనలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్, విదేశాంగ మంత్రి జైశంకర్, త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ తదితరులు మోదీని కలిసి బ్రీఫింగ్ ఇచ్చారు. విదేశాంగ శాఖ ప్రకటనను బట్టి భారత్ ఇకపైనా శాంతి మార్గంలోనే పయనించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

English summary
The Ministry of External Affairs has issued a statement on the violent clash at Galwan in Ladakh on late Monday night. says Violence result of China's attempt to change status quo and stated tha India committed to ensuring sovereignty
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X