• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Violent wife: అర్దరాత్రి వెళ్లి దుప్పటి కప్పుకుని నిద్రపోతున్న భర్త, విరహం తట్టుకోలేని భార్య, రివర్స్ గేర్ లో

|

భోపాల్/ బెంగళూరు: ప్రతిరోజు రాత్రి భర్త ఎప్పుడో వచ్చి తనకు సంసార సుఖం ఇవ్వడం లేదని భార్య రగిలిపోయింది. ప్రతిరోజు ఏదోఒక కుంటిసాకు చెప్పి భర్త రాత్రి పొద్దుపోయిన తరువాత ఇంటికి వెళ్లి దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నాడు. దంపతులు రాత్రి రామాయణం విషయంలో ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోయింది. అంతే నువ్వు అందంగా ఉన్నావనే పొగరుతో బయట పరాయి మహిళలతో తిరుగుళ్లు తిరిగి అర్దరాత్రి లేటుగా ఇంటికి వస్తున్నావా అంటూ రెచ్చిపోయిన భార్య రివర్స్ గేర్ లో చేసిన పనికి అందరూ బిత్తరపోయారు.

Nurse: అంబులెన్స్ లో అబ్బాయితో అదరగొట్టిన ఆంటీ, దెబ్బకు ఏరియానే హడల్, పంచాయితీతో క్లైమాక్స్ !Nurse: అంబులెన్స్ లో అబ్బాయితో అదరగొట్టిన ఆంటీ, దెబ్బకు ఏరియానే హడల్, పంచాయితీతో క్లైమాక్స్ !

సూపర్ జోడి... లేటుగా మ్యారేజ్

సూపర్ జోడి... లేటుగా మ్యారేజ్


మద్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో అరవింద్ అహిర్వార్ (38), శివకుమారి అహిర్వార్ (35) దంపతులు నివాసం ఉంటున్నారు. 2016వ సంవత్సరంలో అరవింద్, శివకుమారి దంపతుల వివాహం జరిగింది. వివాహం ఆలస్యంగా జరగడంతో ఎప్పుడు భర్త అరవింద్ తో కలిసి ఉండాలని అతని భార్య శివకుమారి కలలుకనింది.

 రాత్రి సుఖం లేదు కానీ రాత్రి భర్త ?

రాత్రి సుఖం లేదు కానీ రాత్రి భర్త ?


వివాహం జరిగిన తరువాత అరవింద్, శివకుమారి దంపతులు (భర్త సొంత ఊరిలో) కాపురం పెట్టారు. సంవత్సరం నుంచి అరవింద్ రాత్రిపూట ఆలస్యంగా ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాడు. రాత్రి భర్త త్వరగా ఇంటికి వస్తాడని, సంసారసుఖం అందిస్తాడని శివకుమారి చాలా కాలం నుంచి ఎంతో ఆశగా ఆమె కోరికలు చంపుకుని ఎదురు చూసింది.

చన్నీళ్లు పోసుకుని నిద్రపోతున్న భార్య

చన్నీళ్లు పోసుకుని నిద్రపోతున్న భార్య

ఎంత చెప్పినా భర్త అరవింద్ అర్దరాత్రి దాటిన తరువాత ఇంటికి వచ్చి దుప్పటి కప్పుకుని నిద్రపోవడంతో అతని భార్య శివకుమారికి చిర్రెత్తిపోయింది. ఏమిటి నువ్వు చేస్తున్న పని నాకు సంసార సుఖం ఇవ్వలేవా ? ఎందుకు ఇలా చేస్తున్నావ్ ? అంటూ భార్య శివకుమారి అతన్ని నిలదీసింది. ఏదో కుంటిసాకులు చెబుతూ అరవింద్ ఇంతకాలం తప్పించుకుని తిరుగుతున్నాడు.

విరహంతో రగిలిపోయిన భార్య

విరహంతో రగిలిపోయిన భార్య

నువ్వు పద్దతి మార్చుకోకుంటే తాను పుట్టింటికి వెళ్లిపోతానని భార్య శివకుమారి ఆమె భర్త అరవింద్ కు తేల్చిచెప్పింది. అరవింద్, శివకుమారి దంపతుల గొడవ గురించి తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు పంచాయితీలు చేయి ఇద్దరికి నచ్చచెప్పారు. అయినా అరవింద్ లో ఎలాంటి మార్పు రాకపోవడం, రాత్రి ఇంకా లేటుగా ఇంటికి వెళ్లడం చేశాడు.

భార్య చేసిన పనికి రివర్స్

భార్య చేసిన పనికి రివర్స్

నా భర్త చూడటానికి అందంగా ఉంటాడని, అందుకే పరాయి స్త్రీల వ్యామోహంతో వారితో ఎంజాయ్ చేసి రాత్రి లేటుగా ఇంటికి వస్తున్నాడని భార్య రగిలిపోయింది. సోమవారం అర్దరాత్రి ఇంటికి వెళ్లిన అరవింద్ తో భార్య శివకుమారి పెద్దగా గొడవ పెట్టుకుంది. అర్దరాత్రి అరవింద్ కుటుంబ సభ్యులు శివకుమారికి సర్ది చెప్పారు. మంగళవారం వేకువ జామున 5 గంటల సమయంలో శివకుమారి గ్యాస్ స్టౌవ్ మీద నూన కాగపెట్టి వేడివేడిగా ఉన్న నూనె తీసుకెళ్లి గాఢంగా నిద్రపోతున్న భర్త అరవింద్ ముఖం మీద పోసేసింది.

కుయ్రోమోర్రో అంటున్న భర్త

కుయ్రోమోర్రో అంటున్న భర్త


ముఖంతో పాటు తలలో వేడినూనె పడటంతో అరవింద్ ఆర్తనాదాలు చేశాడు. తీవ్రగాయాలైన అరవింద్ ను అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. రాత్రి ఇంటికి లేటుగా వస్తున్న భర్త అరవింద్ మీద కక్షపెంచుకుని తాను ఇలా చేశానని శివకుమారి అంగీకరించిందని బుధవారం ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు చెప్పారు. ముఖం పూర్తిగా కాలిపోవడంతో ఆసుపత్రిలో అరవింద్ కుయ్యో మోర్రో అంటున్నాడు. ఎక్కడైనా భార్య చెడుతిరుగుడు తిరుగుతుంటే భర్తలు ఇలా బుద్ది చెబుతారని, అయితే అరవింద్ విషయంలో రివర్స్ గా జరిగిందని పోలీసులు అంటున్నారు.

English summary
Violent wife: A daily spat over returning home late from work every day ended up with the woman Pouring boiling oil on her Husband's face while he was asleep
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X