వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Interesting:వామ్మో... ఒకేసారి మూడు డజన్ల పిల్లలు పెట్టిన రక్తపింజరి పాము..

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరు జూలో ఓ రస్సెల్ వైపర్ జాతికి చెందిన పాము ఏకంగా 33 పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా ఈ జాతికి చెందిన పాము ఒకేసారి 60 పిల్లలు పెట్టగలదు. సాధారణ పాములకు రక్తపింజరి (రస్సెల్ వైపర్) పాముకు అదే తేడా అని జంతుశాస్త్రవేత్తలు చెబుతున్నారు. రక్తపింజరి పాముకు పుట్టిన 33 పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు జూ డైరెక్టర్ సెంతిల్ నాథన్ చెప్పారు. అయితే అన్ని పాములను అదే జూకు పరిమితం చేయబోమని చెప్పారు.

ఈ పాములను అటవీశాఖకు అప్పగిస్తామని సెంతిల్ చెప్పారు. అయితే అన్ని పాములు అడవిలో బతికే అవకాశాలు లేవని కూడా చెప్పారు. ఎందుకంటే చిన్న పాములను ఇతర పెద్ద జంతువులు చంపేస్తాయని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఈ జాతికి చెందిన వైపర్ పాము 60 పిల్లలను పెట్టిందని గుర్తు చేశారు సెంతిల్. అది కూడా ఇదే జూలో జరిగిందని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ నెలలో ఈ వైపర్ పాము కోయంబత్తూరులోని ఓ ఇంట్లోకి నక్కినప్పుడు పాములు పట్టేవారు దీన్ని అత్యంత చాకచక్యంగా పట్టుకుని జూ అధికారులకు అప్పగించారు. ఇప్పుడు ఈ పామే 33 పిల్లలకు జన్మనిచ్చింది.

ఇదిలా ఉంటే శుక్రవారం రోజున కోయంబత్తూర్‌ శివార్లలో నివసించే ఓ వ్యక్తి ఇంట్లోకి వైపర్ జాతికి చెందిన పాము దూరింది. అది ఆవ్యక్తి ఇంట్లోని బాత్‌రూంలో నక్కి ఉంది. ఇది గమనించిన వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఓ పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేశాడు. ఆ వ్యక్తి వచ్చి ఆ పామును పడుతున్న సమయంలో అది 35 పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ పామును అనైకట్టి అటవీప్రాంతంలో వదిలారు. ఈ రస్సెల్ వైపర్ పాము అత్యంత విషపూరితమైనదని అటవీశాఖ అధికారులు చెప్పారు.

Viper snake gives birth to 33 snakelets in Coimbatore Zoo

రస్సెల్స్ వైపర్ అనే ఈ అత్యంత విషపూరితమైన పాములు భారత ఉపఖండంలో ఎక్కువగా నివసిస్తాయి. అంతేకాదు ఆగ్నేసియా, దక్షిణ చైనా , తైవాన్‌లో కూడా ఎక్కువగా సంచరిస్తుంటాయి. స్కాట్‌లాండ్‌కు చెందిన పాట్రిక్ రస్సెల్ అనే హెర్పటాలజిస్ట్ పేరును ఈ పాములకు పెట్టడం జరిగింది. ఆయన భారత దేశంలో సంచరిస్తున్న పాములపై పరిశోధనలు చేశారు. ఈ పాము నాలుగు అడుగుల పొడవు ఉంటుంది. ఈ పామును వివిధ భాషల్లో వివిధ పేర్లున్నాయి. తెలుగులో రక్తపింజరి అని పిలుస్తారు.

English summary
A Russell's viper gave birth to 33 snakelets at the Coimbatore Zoo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X