వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అసెంబ్లీ పోల్: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు, కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Delhi Assembly Elections 2020 : Political Bigwigs Cast Their Vote !

ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో గల 70 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు సమస్యను పరిస్కరించారు. హస్తినలో ప్రముఖులు ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. షహీన్‌బాగ్ ఘటన నేపథ్యంలో ఎన్నికల కోసం భారీగా పోలీసు బలగాలను మొహరించారు.

వీఐపీల ఓటింగ్

ఇక వీఐపీలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తన నియోజకవర్గంలోని సివిల్ లైన్స్ పోలింగ్ బూత వద్ద కుటుంబసభ్యులతో కలిసి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటు వేశారు. ఢిల్లీ దక్షిణ ఎక్స్‌టెన్సన్ పార్ట్-2 పోలింగ్ స్టేషన్ వద్ద బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి కూడా ఓటు వేశారు. తర్వాత తమ పార్టీ గెలుస్తోందని అంటూ విజయ సంకేతం చూపించారు. ఇటు రాజిందర్ నగర్‌లో ఆప్ క్యాండెట్ రాఘవ్ చాద్ద ఓటేశారు.

ఓటేసిన జై శంకర్

తుగ్లక్ క్రెసెంట్‌లో గల ఎన్డీఎంసీ స్కూల్ ఆఫ్ సైన్స్ పోలింగ్ బూత్ వద్ద విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వివాదాస్పద బీజేపీ నేత పర్వేశ్ వర్మ మటియాలలో.. తుగ్లక్ క్రెసెంట్ వద్ద గల ఎన్డీఎంసీ స్కూల్ ఆఫ్ సైన్స్ హ్యుమానిటీస్ వద్ద గల పోలింగ్ బూత్‌లో జస్టిస్ ఆర్ బానుమతి, ఢిల్లీ కృష్ణానగర్‌లో గల రాతన్ దేవి పబ్లిక్ స్కూల్‌లో కేంద్రమంత్రి హర్షవర్ధన్, అతని తల్లి ఓటు వేశారు.

ఫ్యామిలీతో ఎల్‌జీ ..

గ్రేటర్ కైలాస్ వద్ద గల పోలింగ్ స్టేషన్‌లో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, భార్యతో కలిసి ఓటు వేశారు. నిర్మాణ్ భవన్ వద్ద గల పోలింగ్ బూత్ వద్ద మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఆరెస్సెస్ నేత రామ్‌లాల్, చాందినీ చౌక్‌లోని ఠాగూర్ గార్డెన్ ఎక్స్‌టెన్షన్ పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా అమూల్యమైన ఓటును వేశారు.

నేతల పిలుపు

నేతల పిలుపు

మరోవైపు మార్పు కోసం ఓటేయాలని ఢిల్లీ ప్రజలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో మహిళలు తప్పకుండా ఓటేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఓటు వేయడం మీ బాధ్యత అని, వారి ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని కుటుంబసభ్యులకు సూచించారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని ఢిల్లీ ప్రజలకు ప్రధాని మోడీ వినతి, రికార్డ్ పోలింగ్ నమోదు కావాలని ఆకాంక్షించారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా కోరారు.

ఈవీఎంల మొరాయింపు

ఈవీఎంల మొరాయింపు

యుమనా విహర్‌లో గల సీ10 బ్లాక్ వద్ద ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ప్రారంభం కాలేదు. పోలింగ్ బూత్ వద్దకు ఈసీ టెక్నికల్ టీం వచ్చి సరిచేశారు. మరోవైపు సీఆర్ పార్క్ బూత్ వద్ద 45 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. సర్దార్ పటేల్ విద్యాలయ పోలింగ్ బూత్ నంబర్ 114 వద్ద ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైంది.

English summary
vips poll thier vote in delhi assembly election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X