వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం పరువు సమస్య రు. 150 కోట్లు ఖర్చైనా గెలవాలస్సిందే ! ఆడియోటేపుల కలకలం !

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : సీఎం కొడుకు గెలుపు కోసం రూ. 150 కోట్లు ఖర్చు..! || Oneindia Telugu

బెంగళూరు: మండ్య లోక్ సభ నియోజక వర్గం ఎన్నికల్లో కర్ణాటక ముఖ్యమంత్రి హెహ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిని గెలిపించుకోవడానికి రూ. 150 కోట్లు ఖర్చు చెయ్యాలని జేడీఎస్ పార్టీ నాయకులు చర్చించుకున్నారు. నిఖిల్ కుమారస్వామి గెలుపు కోసం రూ. 150 కోట్లు ఖర్చు చెయ్యాలని జేడీఎస్ నాయకులు మాట్లాడుకున్న ఆడియో వైరల్ అయ్యింది. తాము మాట్లాడుకున్న మాట వాస్తవమే అని జేడీఎస్ నాయకులు అంగీకరించారని గురువారం కొన్ని కన్నడ మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో ఈసీ, ఐటీ శాఖ అధికారులు ఎంట్రీ ఇచ్చారు.

మండ్య సిట్టింగ్ ఎంపీ

మండ్య సిట్టింగ్ ఎంపీ

మండ్య లోక్ సభ నియోజక వర్గం ఎంపీ శివరామే గౌడ కుమారుడు చేతన్ గౌడ, జేడీఎస్ నాయకుడు పి. రమేష్ నిఖిల్ కుమారస్వామి గెలుపు కోసం రూ. 150 కోట్లు ఖర్చు అవుతోందని మాట్లాడుకుంటున్న ఆడియో మీడియాకు విడుదలైయ్యింది. జేడీఎస్ నాయకులు మాట్లాడుకుంటున్న ఆడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఆడియో నిజమే !

ఆడియో నిజమే !

నిఖిల్ కుమారస్వామి గెలుపు కోసం రూ. 150 కోట్లు ఖర్చు అవుతోందని తాము మాట్లాడుకుంటున్న సమయంలో జేడీఎస్ పార్టీ నాయకులు అక్కడ ఉన్నారని, ఆ సమయంలో ఆడియో రికార్డు అయ్యిందని ఇద్దరు జేడీఎస్ నాయకులు ఎన్నికల కమిషన్, ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు తప్పు అంగీకరించారని కన్నడ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.

ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఆడియో !

ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఆడియో !

జేడీఎస్ పార్టీకి చెందిన చేతన్ గౌడ. పి. రమేష్ తాము మాట్లాడుకున్న మాట వాస్తవమే అని అంగీకరించారని కన్నడ మీడియా వార్తలు ప్రసారం చేసింది. మండ్యలో నిఖిల్ గౌడ గెలుపు కోసం రూ. 150 కోట్లు ఖర్చు చెయ్యాలని విడుదలైన ఆడియో నిజమా కాదా అని విషయం నిర్దారించుకోవడానికి ఆ టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలని ఎన్నికల కమీషన్, ఆదాయపన్ను శాఖ నిర్ణయించిందని కన్నడ మీడియా తెలిపింది.

మండ్య ఓటర్లు లక్షం

మండ్య ఓటర్లు లక్షం

నిఖిల్ కుమారస్వామిని గెలిపించుకోవడం కోసం మండ్య లోక్ సభ నియోజక వర్గంలోని ప్రతి బూత్ కు రూ. 5 లక్షలు ఖర్చు చెయ్యాలని జేడీఎస్ నాయకులు మాట్లాడుకున్నారు. అయితే ఆడియోలో ఉన్న మాటలు తమ కుమారుడు చేతన్ గౌడది కాదని మండ్య సిట్టింగ్ ఎంపీ శివరామేగౌడ గురువారం మీడియాకు చెప్పారు. సుమలత సినీ రంగం నుంచి వచ్చారని, మిమిక్రి చేయించడం ఆమెకు చాల బాగా తెలుసని ఎంపీ శివరామేగౌడ ఆరోపించారు.

 కుట్రలు చేస్తున్నారు

కుట్రలు చేస్తున్నారు

తనను మండ్య లోక్ సభ ఎన్నికల్లో ఓడించడానికి అధికార పార్టీ నాయకులు చాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బహుబాష నటి సుమలత ఆరోపించారు. మండ్య ప్రజలు తమ వైపు ఉన్నారని, తాను ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాదిస్తానని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదని సుమలత ధీమా వ్యక్తం చేశారు. జేడీఎస్ నాయకుల ఆడియో విడుదల కావడంతో ఆ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు.

English summary
Viral audio between two JDS leaders discussing about spending 150 crores for Nikhil Kumaraswamy win in Mandya, JDS leaders confessed the truth infront of IT and Election Commission?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X