వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళతో రాసలీలల ఆడియో వైరల్: రెబల్ ఎమ్మెల్యే వివరణ, లవ్ స్టోరీలు, డోంట్ కేర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జేడీఎస్ పార్టీ కర్ణాటక శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, రెబల్ ఎమ్మెల్యే హెచ్. విశ్వనాథ్ గొంతులాగే ఉన్న ఓ ఆడియో విడుదల కావడంతో వైరల్ అయ్యింది. మహిళతో సరసాలు కొనసాగిస్తున్నట్లు ఉన్న ఓ ఆడియో ప్రస్తుతం వైరల్ కావడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

మహిళతో మాట్లాడుతున్న ఆడియో విడుదలైన విషయంపై రెబల్ ఎమ్మెల్యే హెచ్. విశ్వనాథ్ వివరణ ఇచ్చారు. వైరల్ అయిన ఆడియో గురించి తనకు సమాచారం వచ్చిందని అన్నారు. ప్రస్తుత రాజకీయాలు దృష్టిలో పెట్టుటకుని తనకు చెడ్డపేరు తీసుకురావడానికి ఇలాంటి చీప్ ట్రిక్ పాలిటిక్స్ చేస్తున్నారని విశ్వనాథ్ ఆరోపించారు.

Viral audio, Karnataka JDS former state president H Vishwanath clarification.

తన గొంతును మిమిక్రి చేసి ఇలాంటి ఆడియో తయారు చేసి విడుదల చేశారని విశ్వనాథ్ చెబుతున్నారు. లవ్ స్టోరీల గురించి పుస్తకాలు రాశానని, ఇలాంటి నీచపు పనులు తాను చెయ్యలేదని అంటున్న విశ్వనాథ్ తన గొంతు లాగే ఉన్న ఈ ఆడియో నకిలి అని ఆరోపించారు. సరసాలు, సెక్స్ కు అనుబంధం ఉన్నటువంటి వార్తలతో త్వరగా చెడు ప్రచారం చెయ్యడానికి తన ప్రత్యర్థులు ఈ నకిలి ఆడియో తయారు చేసి విడుదల చేయించారని ఆరోపించారు.

తాను ప్రతినిధ్య వహిస్తున్న హణసూరు నియోజక వర్గంలో తన దిష్టి బొమ్మలు దహనం చేసి అంత్యసంస్కారాలు చేస్తున్నారని, వీటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, రాజకీయాల్లో లాంటివి మామూలే అని, తాను చాల తేలిగ్గా తీసుకుంటున్నానని విశ్వనాథ్ చెప్పారు.

తనతో పాటు రెబల్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ మంత్రి పదవులు కావాలని డిమాండ్ చెయ్యలేదని విశ్వనాథ్ స్పష్టం చేశారు. మంత్రి పదవులు ఇస్తామని మాకు ఆఫర్ ఇచ్చిన మాజీ సీఎం సిద్దరామయ్యకు చాల థ్యాక్స్, ఆయన రాజకీయాలు ఇలాగే ఉంటాయని విశ్వనాథ్ వ్యంగంగా అన్నారు.

English summary
Viral audio, JDS former state president H Vishwanath clarification. Vishwanath said, the current political scanario these type cheap tactics expected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X