• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

శశికళ ఆడియో టేపులు Viral: అన్నాడీఎంకేలోకి చిన్నమ్మ రీఎంట్రీ-ఉలిక్కిపడ్డ పళని వర్గం..వాట్‌ నెక్ట్స్..?

|

చెన్నై: తమిళనాడుకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర ఓటమి చవిచూసింది. దివంగత నేత జయలలిత ఆ పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె లేకుండా జరిగిన తొలి ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. జయలలిత మరణాంతరం ఆ పార్టీలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీలో నెంబర్ టూగా ఉంటూ వచ్చిన శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడం ఆ తర్వాత విడుదల కావడం జరిగింది. ఈ సారి ఎన్నికల్లో మాత్రం తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేసింది. ఇక అన్నా డీఎంకే పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీపై శశికళ కన్నేసినట్లు కనిపిస్తోంది. తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో శశికళ మాట్లాడిన ఓ ఆడియో టేపు హల్చల్ చేస్తోంది. దీన్ని పరిశీలిస్తే శశికళ పార్టీ పగ్గాలు మళ్లీ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

 వైరల్ అయిన చిన్నమ్మ ఆడియో టేపులు

వైరల్ అయిన చిన్నమ్మ ఆడియో టేపులు

అన్నాడీఎంకే ఏఎంఎంకే కార్యకర్తలతో మాట్లాడుతున్నట్లుగా ఆ ఆడియో క్లిప్పింగ్ ఉంది. పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని శశికళ చెబుతున్నట్లుగా స్పష్టంగా ఉంది. అంతేకాదు పార్టీ వ్యవస్థాపకులు ఎంజీఆర్, అమ్మ జయలలిత ఆశయాలకు అనుగుణంగా తిరిగి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. శశికళ ఈ మాటలు చెప్పగానే కార్యకర్తల్లో ఎక్కడా లేని ఉత్సాహం కనిపించింది. వెంటనే వారంతా చిన్నమ్మకు జేజేలు పలకడం కూడా ఆడియో క్లిప్పింగుల్లో వినిపించింది. అంతేకాదు వెంటనే పార్టీని తన చేతుల్లోకి తీసుకుని కొత్త జీవం పోయాలని ఆమెను కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు.

 శశికళ వద్దకు పన్నీర్ సెల్వం సన్నిహితులు

శశికళ వద్దకు పన్నీర్ సెల్వం సన్నిహితులు

ఇదిలా ఉంటే అమ్మ మరణం తర్వాత శశికళతో పూర్తిగా విబేధించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా తన సన్నిహితులను శశికళ వద్దకు పంపినట్లు అన్నాడీఎంకే వర్గాలు చెప్పాయి. ఇప్పటికే పళనిస్వామి పన్నీర్ సెల్వంల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే శశికళను మచ్చిక చేసుకోవాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో శశికళకు వ్యతిరేకంగా పళనిస్వామి-పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటయ్యాయి. బయటకు మాత్రం ఇద్దరు కలిసి ఉన్నట్లే కనిపించినప్పటికీ లోలోపల మాత్రం ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నట్లు అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అన్నా డీఎంకే మధ్యంతర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆ పదవి నుంచి ఆమెను తొలగిస్తూ పార్టీ తీర్మానం చేసింది. దీన్ని సవాలు చేస్తూ 2017లో శశికళ చెన్నై సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉంది. జూన్ 18వ తేదీన ఈ కేసును విచారణ చేయనుంది ధర్మాసనం.

 గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకర్తలకు ఫోన్

గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకర్తలకు ఫోన్

ఇక జైలు నుంచి విడుదలయ్యాక గత కొన్ని రోజులుగా పార్టీ అన్నాడీఎంకే, ఏఎంఎంకే కార్యకర్తలతో, ముఖ్య అనుచరులతో శశికళ ఫోనులో సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈ సమయంలో కార్యకర్తలు తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఏఎంఎంకే కార్యకర్త ఒకరు తన రక్తంతో చిన్నమ్మకు లేఖ రాసినట్లు సమాచారం. అన్నాడీఎంకేలో ఏఎంఎంకే పార్టీని విలీనం చేయాలని రక్తంతో రాసిన లేఖను ఏఎంఎకే పార్టీ కార్యకర్త తిరుమల్‌సామీ పంపారటు.ఈ లేఖను కొరియర్ ద్వారా శశికళ క్యాంప్ ఆఫీసుకు పంపినట్లు తిరుమల్‌సామి చెప్పారు.

 పళనిస్వామి వర్గంలో ఆందోళన

పళనిస్వామి వర్గంలో ఆందోళన

ఇక సోషల్ ‌మీడియాలో ఆడియో క్లిప్పింగులు వైరల్ కావడంతో మాజీ సీఎం పళనిస్వామి శిబిరంలో ఆందోళన ప్రారంభమైంది. మరోవైపు అన్నాడీఎంకే నేత బాలకృష్ణన్‌కు కూడా ఫోన్ వెళ్లడం ఆయన వెంటనే చిన్నమ్మకు జేజేలు పలుకుతూ డిజిటల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగిపోయాయి. ఇక శశికళ మాట్లాడిన ప్రతిసారి కేడర్‌కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీ తిరిగి పుంజుకుంటుందని ధైర్యం చెప్పారు. ఎవరూ నిరుత్సాహపడొద్దంటూ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే తాను పార్టీ పగ్గాలు చేపడుతానంటూ కార్యకర్తలకు హామీ ఇచ్చారు శశికళ. తనకు ఇక ఏ భయం లేదని త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చి అన్నాడీఎంకే పార్టీని గాడిలో పెడతానని చెప్పుకొచ్చారు.

  #TopNewsOfTheDay : Joe Biden Administration 'undecided' On Ending Trump-Era H-1B Visa Ban
  English summary
  Jayalalithaa's close Confidante VK Sasikala said that she would soon return to politics and take over the AIADMK party according to a viral audio clip that is making rounds.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X