వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉరి: అమీర్ ఖాన్‌ని నేను అన్లేదని తస్లీమా, భారత్ సేఫ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఓ వార్తా టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ... బాలీవుడ్ నటులకు, ఎవరికైనా భారత్ అత్యంత భద్రత కలిగిన దేశమని చెప్పారు.

కాగా, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా సామాజిక అనుసంధాన వేదికల్లో ఓ ట్వీట్ బాగా చక్కెర్లు కొడుతోంది. అది ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌దిగా పేర్కొంటున్నారు.

ఆ పోస్ట్‌లో... హిందూ దేవతలను వెక్కిరిస్తూ అమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రం రూ.300 కోట్లు వసూలు చేసిందని, ఇదే తరహా సినిమా పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌లో నడుస్తుందా? ఇతర దేశాల్లో అక్కడ ఉరి తీస్తారని, అయినప్పటికీ భారత్‌లో అసహనం అనడం ఏమిటని అందులో ఉంది.

పక్కనే తస్లీమా నస్రీన్ ఫోటో గ్రాఫ్ ఉంది. దీంతో ఆ వ్యాఖ్యలు తస్లీమా నస్రీన్ చేసి ఉంటుందని చాలామంది భావించారు. దీనిపై ఆమె వివరణ ఇచ్చారు. ఆ పోస్టు తాను చేయలేదన్నారు. కొందరు తన వ్యాఖ్యలుగా వాటిని పేర్కొనడం సరికాదన్నారు.

 Viral Post against Aamir Khan: Taslima Nasreen clears air, says 'Not my words'

టిక్కెట్లు తెప్పిస్తాం: బిజెపి నేతలు

బీజేపీ నేతలు యోగి ఆదిత్యానాథ్, సాథ్వి ప్రాచీలు అమీర్ ఖాన్ పైన మండిపడ్డారు. పాకిస్థాన్ వెళ్లండి లేకుంటే మరే ఇతరదేశానికైనా వెళ్లండని మండిపడ్డారు.

అమీర్ ఖాన్, షారుక్ ఖాన్‌లు ఇద్దరూ పాకిస్థాన్‌కు వెళ్లొచ్చని, లేకుంటే సిరియా, పాలస్తీనా, ఇరాన్, లెబనాన్, టర్కీ, ఇజ్రాయిల్ దేశాల్లో ఎక్కడికి వెళతారో తమకు చెబితే విమానం టిక్కెట్లు ఏర్పాటు చేస్తామని సాథ్వి ప్రాచీ ఎద్దేవా చేశారు. భారత్ విడిచి వెళ్లాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారిని ఆపమని ఎంపీ యోగి ఆదిత్యానాథ్ అన్న విషయం తెలిసిందే.

English summary
A post has been going viral on social media since Tuesday, Nov 24. The post went viral following Aaamir Khan's controversial statement on increasing intolerance in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X