• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

viral video: కరోనాకు విరుగుడు ఇదే -గోమూత్రం తాగితే భారత్ నుంచి కొవిడ్ పరార్: బీజేపీ ఎమ్మెల్యే డెమో

|

''నేను సైన్స్ ను నమ్ముతానా, లేదా అనేది అప్రస్తుతం. గోమూత్రాన్ని మాత్రం కచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే కరోనా వైరస్ మహమ్మారిని ఓడించగల సూపర్ పవర్ గోమూత్రం మాత్రమే. ప్రతిరోజూ పరిగడపునే రెండు మూతల గోమూత్రాన్ని గ్లాసు నీళ్లలో కలిపి తాగారంటే.. కరోనా మన దేశం నుంచే పరారైపోతుంది..'' అని సెలవిచ్చారు ఘనత వహించిన బీజేపీ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్..

షాక్: కరోనాతో రక్తం ఇలా గడ్డ కడుతోంది -అందుకే హఠాన్మరణాలు పెరిగాయి -వైరస్ సోకిన 5రోజుకు..షాక్: కరోనాతో రక్తం ఇలా గడ్డ కడుతోంది -అందుకే హఠాన్మరణాలు పెరిగాయి -వైరస్ సోకిన 5రోజుకు..

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ర‌ణ మృదంగం మోగిస్తూ ప్రతిరోజూ 4వేల మందిని పొట్టనపెట్టుకుంటున్నది. రోజువారీ కొత్త కేసులు 4లక్షలకుపైగా నమోదవుతున్నాయి. దీనికితోడు ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు, వ్యాక్సిన్ల కొరత మరింత ఇబ్బందికరంగా మారింది. వైరస్ ఉధృతి ఇప్పట్లో తగ్గబోదని, ఆగస్టు నాటికి థర్డ్ వేవ్ కూడా వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయినాసరే ఫ్రంట్ లైన్ వారియర్లు శాస్త్రీయ పద్ధతుల్లో పోరాడుతూ ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవేవీ పట్టని కొందరు ఛాందసవాదులు మాత్రం కరోనాకు విరుగుడంటూ వింత ప్రచారాలను చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ మరో అడుగు ముందుకేసి దేశ ప్రజలందరూ గోమూత్రం తాగాలని పిలుపునిచ్చారు..

 viral video: BJP MLA Surendra Singh recommends drinking cow urine to stop Covid spread

కరోనా వైరస్ కు విరుగుడు గోమూత్రమేనని, దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ గోమూత్రం తాగితే భారత్ నుంచి కొవిడ్ కచ్చితంగా పరారైపోతుందని బీజేపీ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని బైరియా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన గోమూత్ర పానం ఎలా చేయాలో, ఎందుకు చేయాలో వివరించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.

అనూహ్యం: మోదీకి జగన్ ఊపిరి -ప్రధానిపై జార్ఖండ్ సీఎం విమర్శలకు ఏపీ సీఎం కౌంటర్ -డియర్ హేమంత్..అనూహ్యం: మోదీకి జగన్ ఊపిరి -ప్రధానిపై జార్ఖండ్ సీఎం విమర్శలకు ఏపీ సీఎం కౌంటర్ -డియర్ హేమంత్..

 viral video: BJP MLA Surendra Singh recommends drinking cow urine to stop Covid spread
  Hyderabad : గోవుని జాతీయ జంతువు గా పరకటించాలి.. అదొక్కటే అజెండా !

  గోమూత్రం సేవిస్తే ఒక్క కొవిడ్ వ్యాధినేకాదు, గుండె సంబంధిత రోగాలూ దరిచేరబోవని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా తాను ఆరోగ్యంగా ఉండటానికి కారణం గోమూత్రమేనని బీజేపీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. పసుపును వేయించి, ముద్దలుగా చేసుకుని మింగడం కూడా ఆరోగ్యానికి మేలుచేస్తుందని అన్నారు. వీరేంద్ర సింగ్ సొంత రాష్ట్రం యూపీలో నిన్న ఒక్కరోజే కరోనా కాటుకు 372 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 28,076మందికి వైరస్ సోకింది. యూపీలో మొత్తం కేసులు 14,53,679కి, మొత్తం మరణాలు 14,873కు పెరిగాయి.

  English summary
  As Covid-19 cases continue to surge across India, a Bharatiya Janata Party (BJP) MLA in Uttar Pradesh has called on people to drink 'gaumutra' (cow urine) to defeat Covid-19. Surendra Singh, MLA from Bairia in Ballia district, has also put up a video of himself drinking cow urine. In the video that has now gone viral, Surendra Singh demonstrated how exactly the cow urine should be taken. While appealing to people to consume cow urine, he himself gulped it down.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X