• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హవ్వా.. పెళ్లి కొడుకు పక్కనే... స్మోక్ చేస్తూ.. రింగులు ఊదుతూ.. ఇదీ నయా ట్రెండ్..

|

పెళ్లి అంటే.. నూరేళ్ల పంట. ఏ మతంలో అయినా.. సంప్రదాయంలో అయినా సరే మ్యారేజ్ ఓకేలా జరుగుతుంది. ఇందులో సందేహానికి తావులేదు. కానీ నయా ట్రెండ్‌లో వింతలు, విశేషాలు.. ఎవరూ ఒప్పుకున్నా ఒప్పుకొకపోయినా అంతే మరీ. ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడు పక్కనే వధువు కూర్చొని ఉంది. ఇద్దరూ భోజనం చేస్తున్నారు. ఎవరిదీ వాళ్లే తింటున్నారు.. కానీ ఒక్కసారిగా రింగులు రింగులు చుట్టి.. కనిపించాయి. తిరిగ్గా చూస్తే స్మోక్ చేసినట్టు కనిపించింది. అదీ కూడా వధువు కావడంతో.. నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

 సడెన్‌గా స్మోక్..

సడెన్‌గా స్మోక్..

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియుదు.. కానీ పెళ్లి తంతు ముగిసిపోయింది. అందరూ భోజనం చేస్తున్నారు. వధువు ఒక్కసారిగా ఏదో పట్టుకున్నట్టు అనిపించింది. హా హా.. అంటూ పైకి చూసింది. ఇంకేముంది రింగులు రింగులతో పొగ వచ్చింది. ఆమె స్మోక్ చేయడంతో అందరూ షాక్ తిన్నారు. వరుడు కూడా ఇబ్బంది పడ్డాడు. ఓయ్.. ఆపు అని భుజం తట్టాడు. ఆ వీడియో ఒకరు ఇన్ స్ట లో షేర్ చేశారు. అదీ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

స్మోక్ కాదు వారయ్యో..

స్మోక్ కాదు వారయ్యో..

కానీ అక్కడ జరిగింది వేరు.. ఆ వధువు ఫుడ్ తీసుకుంటున్నారు. ఏదో కారం తగిలింది. హా హా అంటూ ఊదింది. కారంతో తల్లడిల్లిపోయింది. అక్కడే ఉన్న వరుడు కూడా ఏమయ్యిందని అడిగాడు. కానీ దానిని కొందరు మార్చివేశారు. ఎలా అంటే.. ఫుడ్ ఐటెమ్ పట్టుకుంటే సిగరేట్‌లా మార్చివేశారు. పై నుంచి పొగలు వచ్చేలా చేశారు. ఆమె స్మోక్ చేసినట్టు అభూత కల్పన చేశారు. దానిని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేశారు. నిజమే అనుకొని వధువును తిట్టిపారేశారు.

మీకు తగునా..

మీకు తగునా..

ఏంటీ ఇలా అని కామెంట్స్ చేశారు. బంధువుల ముందు ఇలా చేయొచ్చా అని కామెంట్ చేశారు. సనాతన సాంప్రదాయాన్ని మంట కలుపుతున్నారు అని విరుచుకుపడ్డారు. మీరు చేసే పని.. మరికొందరికీ ఊతం ఇస్తుందని కామెంట్ చేశారు. వధువు స్మోక్ చేయకున్నా.. వీడియో అలా సోషల్ మీడియాలోకి వెళ్లింది. దీంతో నెటిజన్లు ఏకీపారేశారు. సరికాదు అమ్మ.. పద్దతి మార్చుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. భావితరాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ఫైర్ అవుతున్నారు.

English summary
bride and groom sat with close relatives to enjoy the wedding feast. video has a different story to tell. bride is seen smoking and making rings of smoke.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X