• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

viral video: కస్టమర్ల కోసం కొట్టుకు చచ్చారు -యూపీలో చాట్ వ్యాపారుల అరాచకం

|

ఎదుటి వాడు మనకంటే ఎందులోనైనా కాస్త ఎక్కువైతే కొందరికి అదోరకమైన కడుపు మంట. ఆ మంట ఓ గుంపునకు అంటుకుంటే, ఇంకేముంది.. అరాచకమే! లాక్ డౌన్ దెబ్బకు వీధి వ్యాపారాలన్నీ కుదేలైన వేళ.. అరకొరగా వస్తోన్న కస్టమర్ల కోసం దుకాణదారులు కొట్లాడుకున్న వైనం కలవరం పుట్టిస్తోంది. అసలే 'అస్తవ్యస్థ పాలన' అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌లో సోమవారం చోటుచేసుకున్న ఘర్షణ తాలూకు వీడియో నెట్టింట సంచలనంగా మారింది..

వాలంటీర్ వ్యవస్థ రద్దుకు డిమాండ్ -అంతలోనే సీఎం జగన్ కీలక ఆదేశాలు -ఇక ప్రపంచ స్థాయిలో..

వీధి రౌడీల్లా వ్యాపారులు..

వీధి రౌడీల్లా వ్యాపారులు..

ఉత్తరప్రదేశ్ లోని బాగ్‌పట్ పట్టణంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం కాస్త భయానక దాడి వరకు వెళ్లింది. కర్రలు, ఇనుప రాడ్లతో ఒకరిపై ఒకరు దాడికి దిగి నానా హంగామా సృష్టించారు. విక్షణారహితంగా కర్రలతో కొట్టుకుంటూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. వీధి రౌడీలను మించి కొట్లాడుతోన్న ఈ వ్యక్తులు నిజానికి వీధి వ్యాపారులు..

చాట్ తినే కస్టమర్ల కోసం..

చాట్ తినే కస్టమర్ల కోసం..

బాగ్‌పట్ సిటీలో చాట్ దుకాణాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతంలో సోమవారం పట్టపగలు ఈ అరాచక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. లాక్ డౌన్ దెబ్బకు వ్యాపారాలు దీవాళా తీసిన దరిమిలా, ఇప్పుడిప్పుడే పెరుగుతోన్న కస్టమర్లను ఆకట్టుకునేందుకు అక్కడి చాట్ వ్యాపారులు ఏవేవో ఉపాయాలు రచించారు. కానీ ఒక వర్గం ప్రయత్నాలను మరో వర్గం అడ్డుకుంది. అలా వాదనతో మొదలై, చివరకు తలలు పగలకొట్టుకునేంత వరకూ వెళ్లింది..

బాగ్‌పట్ పోలీసుల వివరణ..

బాగ్‌పట్ పోలీసుల వివరణ..

‘యూపీలో రాజ్యమేలుతోన్న అరాచకానికి ఇదొక మచ్చుతునక' అని కొందరు, ‘అయ్యో, వీధి వ్యాపారుల బతుకులు ఇంతగా దిగజారాయా?' అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా, చాట్ వ్యాపారుల ఘర్షణ వల్ల బాగ్‌పట్ లో శాంతిభద్రతల సమస్యేదీ తలెత్తలేదని, ప్రస్తుతానికి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పోలీసులు చెప్పారు. రోడ్డుపై మారణాయుధాలతో గొడవపడ్డ ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో మిగతా వారిని కూడా అరెస్ట్‌ చేసేందుకు గాలిస్తున్నారు.

కస్టమర్ల కోసం కొట్టుకున్న వీధి వ్యాపారులు -యూపీలో చాట్ వ్యాపారుల హల్ చల్

viral video: ఈ నేతను గుర్తుపట్టారా? -ఒకప్పుడు చక్రం తిప్పి -ఇప్పుడు సాధారణ వ్యక్తిలా మోపెడ్‌పై..

English summary
Clashes broke out between two groups of shopkeepers in Uttar Pradesh's Baghpat district over the issue of attracting customers to their shop. The incident occurred in a busy market Baraut town of Baghpat. "Eight people have arrested and action is being taken," ANI quoted a police official as saying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X