వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video:ప్రేమ ధైర్యం రెండు ఒకే చోట.. నాగుపాము దాహం తీర్చిన ఇతనికి సలాం..!

|
Google Oneindia TeluguNews

ఎక్కడైన రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే ఓ పాము కనిపిస్తే చాలు ఆమడ దూరం భయంతో పరుగులు తీస్తాం. కానీ పాములకు అలవాటు పడ్డ వారు మాత్రం వాటితో ఏకంగా గేమ్స్ ఆడేస్తుంటారు. అవి కూడా సరదాగా మెలికలు తిరుగుతూ ఆడుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆటలు శృతి మించితే ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి ఘటనలు కూడా చాలా చూశాం. పాముల ముందు పాములు పట్టేవాడు బూర ఊదుతుంటే అవి నాట్యం చేయడం కూడా చూసే ఉంటాం. కొందరైతే పాములు కనిపిస్తే చాలు కొట్టి చంపేస్తుంటారు. మరికొందరు అయితే అవి ప్రమాదకరం, విషపూరితమైనవని తెలిసి కూడా వాటికి మేలు చేయాలనే చూస్తారు. ఇప్పుడు అలాంటి స్టోరీనే మనం చదవబోతున్నాం.

వాటర్ బాటిల్ నుంచి...

సాధారణంగా పాలు పోసినవాడినే పాము కాటు వేసి చంపుతుందని అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదుగానీ... ఓ పాము ఎంచక్కా వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాను చుట్టేస్తోంది. ఓ వ్యక్తి ఆ నాగుపాముకు మంచి నీళ్లను వాటర్ బాటిల్ నుంచి పట్టిస్తున్నాడు. అయితే ఈ వీడియో మూడేళ్ల క్రితమే ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చినప్పటికీ మళ్లీ ట్విటర్‌లో వైరల్ అవుతుండటంతో వార్తల్లో నిలిచింది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేయగానే తిరిగి బోలెడన్నీ షేర్లు లైకులు వచ్చాయి.

 సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

ఇక వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి అటవీశాఖ సిబ్బంది. ముందుగా వాటర్ బాటిల్ మూతను తీయగానే దాహంతో ఉన్న ఆ నాగుపాము చకచకా నీళ్లు తాగేసి దాహం తీర్చుకుంది. బాటిల్‌ను పాము ముందు ఉంచగానే గటగటా తాగేసింది ఈ ఇండియన్ కోబ్రా.దాదాపుగా లక్ష మంది ఈ వీడియోను చూశారు. అంతేకాదు వారికి తోచినట్లుగా సరదా కామెంట్స్ కూడా రాసుకొచ్చారు. అయితే చాలామంది జంతుప్రేమికులు మాత్రం నీళ్లు అందించిన ఈ అటవీశాఖ సిబ్బందిపై ప్రశంసల జట్టు కురిపించారు. పాము విషపూరితమైనదని తెలిసి కూడా ధైర్యం చేసి ఆ మూగజీవానికి దాహం తీర్చాడని పేర్కొంటూ మెచ్చుకున్నారు.

 సిబ్బంది ప్రేమకు సలాం చేసిన నెటిజెన్లు

సిబ్బంది ప్రేమకు సలాం చేసిన నెటిజెన్లు

ఆ వ్యక్తి ప్రదర్శించిన ధైర్యానికి కూడా మరికొందరు సలామ్ చేశారు. ధైర్యం ప్రేమ రెండు ఒకేచోట కనిపించాయని మరికొందరు ట్వీట్ చేశారు. మరికొందరైతే ఈ వీడియోకు ఒక్కింత హెచ్చరిక ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. విషపూరితమైన పాములతో చెలగాటం తగదని శిక్షణ పొందిన వారు మాత్రమే ఇలాంటి సాహసాలు చేయాలని రాసి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. అయితే ఇలా ఒక నాగుపాముకు నీళ్లు పట్టిన వీడియో వైరల్ కావడం తొలిసారి కాదు... 2017లో కూడా కర్నాటకలోని కైగా గ్రామంలోకి ఓ పాము దాహంతో రాగా ఓ వ్యక్తి దానికి నీళ్లు పట్టించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

English summary
The incredible sight of a man offering water to a cobra has gone viral on Twitter again, almost three years after it first surfaced online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X