• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

viral video: ఒక్క దెబ్బతో తల్లిని చంపేశాడు -అందరి ఇళ్లలో గొడవలాగే మొదలై..

|

జనరేషన్ గ్యాప్ అంటారో, వృద్ధాప్యంలో చాదస్తం అంటారోగానీ పెద్దవాళ్లున్న దాదాపు ప్రతి ఇంట్లో నిత్యం ఏదో ఒక సమస్య తలెత్తడమో, వాగ్వాదాలు, కుటుంబ తగాదాలు చోటుచేసుకోవడమో చూస్తుంటాం. డబ్బుల్లేని నిరు పేదల కుటుంబాల్లోనైతే ముసలి తల్లిదండ్రుల పాట్లూ అన్నీ ఇన్నీకావు. పెన్షన్లు దండిగా ఇచ్చే దక్షిణాది రాష్ట్రాల్లో కొంత మెరుగే అయినప్పటికీ, ఉత్తరాదిలో.. ప్రత్యేకించి దేశరాజధాని ఢిల్లీలోని మురికివాడల్లో పేద వృద్ధుల జీవితాలు నిత్యనరకమే. సదరు ఫ్రస్ట్రేషన్ లో ఓ కొడుకు తన తల్లిని చంపేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది..

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్‌ పరిస్థితేంటి? -చింతాకే కాంగ్రెస్ టికెట్! తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్‌ పరిస్థితేంటి? -చింతాకే కాంగ్రెస్ టికెట్!

బీజేపీలో ఒకేరోజు భారీ విషాదాలు -కరోనాతో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ గాంధీ మృతి -ఎంపీ శర్మ ఆత్మహత్య బీజేపీలో ఒకేరోజు భారీ విషాదాలు -కరోనాతో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ గాంధీ మృతి -ఎంపీ శర్మ ఆత్మహత్య

ఒక్క దెబ్బకే చనిపోయింది..

ఒక్క దెబ్బకే చనిపోయింది..

కొడుకు కొట్టిన చెంపదెబ్బకు తల్లి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలోని ద్వారాక ప్రాంతంలో నివసించే అవతార్ కౌర్ (76)ను ఆమె కొడుకు రణ్‌బీర్ (45) ఒకే దెబ్బతో హతమార్చాడు. నిరుద్యోగి రణ్‌బీర్ అడపాదడపా కూలీనాలి చేసుకుంటూ తల్లిని తనతోపాటే చూసుకునేవాడు. అయితే, ఇరుగు పొరుగువారితో ముసలావిడ తరచూ గొడవపడేదట. ఈక్రమంలో

పార్కింగ్ విషయంలో గొడవ..

పార్కింగ్ విషయంలో గొడవ..

ద్వారకా ప్రాంతంలో రణ్‌బీర్ ఉంటోన్న ఇంటి వద్ద పార్కింగ్ విషయమై గొడవ తలెత్తింది. ఇంటి ముందు అడ్డదిడ్డంగా వాహనాలను నిలిపిందెవరంటూ రణ్ బీర్ తల్లి అవతార్ కౌర్ సోమవారం మధ్యాహ్నం పొరుగింటివాళ్లతో తగువుపెట్టుకుంది. మాటామాట పెరిగడంతో విషయం పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లింది. పార్కింగ్ విషయంలో తల్లి చేసిన రచ్చ రణ్‌బీర్ కు కోపం తెప్పించిది. పోలీసులు వచ్చేలోపే..

సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు


పొరుగింటి వాళ్లతో గొడవపడ్డ అవతార్‌ను కొడుకు రణ్‌బీర్‌, అతని భార్య తిట్టిపోశారు. పోలీసు కేసు భయంతో వృద్ధురాలిపై రంకెలు వేశారు. ఈ క్రమంలో అవతార్‌ను రణ్‌బీర్ గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. దీంతో అమె అక్కడిక్కడే కుప్పకూలిపోయి స్పృహ కోల్పోయింది. హాస్పిటల్‌కు తీసుకువెళ్లినా ఆమె ప్రాణాలు దక్కలేదు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమేరాల్లో రికార్డ్ అయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు రణ్‌బీర్‌ను అరెస్ట్ చేశారు.

English summary
An elderly woman in Delhi's Dwarka area died after she was slapped by her son during an argument. The woman has been identified as 76-year-old Avtar Kaur. The incident happened when Kaur reportedly got into an argument with her son and her daughter-in-law over parking issues with their neighbours on Monday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X