వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: అయ్యో పాపం..చెట్టుకు కట్టేసి చితకబాదారు: వీడియోలో ఆ ఏనుగు బాధ వింటుంటే..!

|
Google Oneindia TeluguNews

కోయంబత్తూరు: మూగజీవాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తమపై దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని వాటి బారిన పడుతున్న ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మూగజీవాలపై దాడులను పలు జంతుప్రేమికులు ఖండిస్తున్నప్పటికీ అదే సమయంలో ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యమే కదా అనే వాదన బలంగా వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని మాసినగుడి ప్రాంతంలో ఓ టైరును కాల్చి ఓ ఏనుగుపై విసరడంతో అది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో జంతు ప్రేమికులు రంగంలోకి దిగి మూగజీవాలను రక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ ఘటన మరవక ముందే అదే రాష్ట్రంలోని కోయంబత్తూరులో మరో ఏనుగుపై కఠినంగా దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు.

Recommended Video

Anand Mahindra Shares Video of a Tiger And Elephant ఏనుగు, పులి వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా...!

ఏనుగును చెట్టుకు కట్టేసి...

మూగజీవాలంటే అందరికీ ప్రాణమే. అయితే కొన్ని జంతువులు మనుషులపై దాడి చేస్తుంటే వాటి బారినుంచి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ క్రమంలో అవి మృతి చెందడం జరుగుతోంది. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ ఏనుగుపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తే ఎవరికైనా సరే అయ్యో పాపం అని అనిపించక మానదు. రీజువెనేషన్ క్యాంపులోని ఓ ఏనుగును చెట్టుకు కట్టేసి ఇద్దరు వ్యక్తులు చితకబాదారు. కర్రలతో ఇష్టమొచ్చినట్లు బాదారు. ఈ దృశ్యాన్ని ఆ శిబిరానికి దగ్గరలో ఉన్న స్థానికులు తమ మొబైల్ ఫోన్లతో వీడియో రికార్డు చేశారు.

బాధ భరించలేక తల్లడిల్లిన గజరాజు

బాధ భరించలేక తల్లడిల్లిన గజరాజు

ఫిబ్రవరి 8వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరిలలోని పలు మఠాల నుంచి కొన్ని ఏనుగులను ఈ రీజువెనేషన్ క్యాంప్‌కు తరలించడం జరిగింది. ఈ క్యాంపు కోయంబత్తూరు జిల్లాలోని తేకంపట్టిలో ఉంది. ఇక్కడే ఏనుగులను దాదాపు రెండు నెలల పాటు ఉంచుతారు. ఈ క్రమంలోనే ఆ గజరాజుపై ఇద్దరు వ్యక్తులు కర్రలతో చితకబాదారు. పాపం ఆ మూగజీవి ఘీంకారాలు పెట్టిందే తప్ప తాను అనుభవిస్తున్న బాధను మాత్రం చెప్పలేకపోయింది. ఈవీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో పలువురు జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూగజీవాలపై మనిషి దాడి చేయడం ఎప్పుడు మానేస్తాడంటూ ప్రశ్నించారు. ఇక వీడియో వైరల్ అవడంతో ఆ గజరాజును చితకబాదిన ఇద్దరు వ్యక్తులు వినీల్ కుమార్, శివప్రసాద్‌లను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు.

తమిళనాడులోనే ఎక్కువగా...

తమిళనాడులోనే ఎక్కువగా...


మూగ జంతువులపై మనిషి దాడులు ఎక్కువగా తమిళనాడులోనే కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఏనుగులపై దాడులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో ఏనుగులు మరణించాయి కూడా. కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని మాసినగుడి గ్రామంలోకి ఏనుగు ప్రవేశించడంతో దాన్ని తరిమికొట్టేందుకు ఓ టైరును కాల్చి దానిపై విసిరారు గ్రామస్తులు. మంటల్లో చిక్కుకున్న ఆ గజరాజు తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం జనవరి 19న క్యాంప్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఏనుగుపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఏనుగులను కాపాడేందుకు....

ఏనుగులను కాపాడేందుకు....

గతవారం ఏనుగుల మరణాలపై చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది మద్రాసు హైకోర్టు. చనిపోతున్న ఏనుగుల మరణాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణ చేయించాలని ఆదేశించింది. ఏనుగులు పర్యావరణ వ్యవస్థలో భాగమని వాటిని చంపే హక్కు లేదంటూ మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏనుగుల మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించింది.

English summary
Days after an elephant was killed in Tamilnadu, another video of two men beating an elephant goes viral on social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X