• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

viral video: బట్టలూడదీసి బీజేపీ ఎమ్మెల్యేపై రైతుల దాడి -సాగు చట్టాలపై పోరులో అనూహ్య ఘటన -ఖండనలు

|

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమంలో మరోసారి హింస తలెత్తింది. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ గడిచిన నాలుగు నెలలుగా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా, చివరిసారి జనవరి 26న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరగ్గా, ఇప్పుడు పంజాబ్ లో ఏకంగా బీజేపీ ఎమ్మెల్యేపైనే రైతులు దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే బట్టలూడదీసి తరిమికొడుతూ నానా రభస సృష్టించారు. ఈ ఘటనపై రైతు సంఘాలు సహా సర్వత్రా ఖండనలు వెలువడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

శ్రీశైలం వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి -నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం -8మంది తమిళనాడు వాసులు మృతిశ్రీశైలం వెళ్లొస్తూ మృత్యు ఒడిలోకి -నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం -8మంది తమిళనాడు వాసులు మృతి

నడిరోడ్డుపై బట్టలు చించి..

నడిరోడ్డుపై బట్టలు చించి..

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో తీవ్రంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ లోని ముక్త్సర్ జిల్లాలోని మాలోట్‌ లోని అనూహ్య సంఘటన జరిగింది. అబోహర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ పై భయానక దాడి జరిగింది. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన మలోట్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సాగు చట్టాలకు అనుకూలంగా మాట్లాడబోయిన ఎమ్మెల్యేపై రైతులు దాడికి తెగబడ్డారు. నడిరోడ్డుపైనే ఎమ్మెల్యే బట్టలు చించి చిదకబాదారు. పోలీసులు వారిస్తున్నా రైతులు ఏమాత్రం తగ్గలేదు. ఈ ఘటనకు ముందు, వెనుక గంటలపాటు హైడ్రామా జరిగింది..

బీజేపీ కార్యాలయాన్ని చుట్టుముట్టి..

బీజేపీ కార్యాలయాన్ని చుట్టుముట్టి..

అబోహర్ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ శనివారం మాలోట్ లోని బీజేపీ కార్యాలయంలో సాగు చట్టాలకు అనుకూలంగా మాట్లాడుతానంటూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న రైతులు.. మాలోట్‌లోని బీజేపీ కార్యాలయాన్నిముట్టడించారు. వందల సంఖ్యలో రైతులు దూసుకురావడాన్ని గమనించిన పోలీసులు.. ఎమ్మెల్యేను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. పార్టీ ఆఫీసులోకి చొరబడ్డ రైతులు ఫర్నీచర్ ధ్వంసం చేసి ఎమ్మెల్యేవైపు దూసుకెళ్లారు. అప్పటికే ఎమ్మెల్యేను ఆఫీసు నుంచి బయటికి తీసుకెళ్లిన పోలీసులు.. దగ్గర్లోని ఓ దుకాణం లోపలికి తీసుకెళ్లారు. వారిని అనుసరించిన రైతులు దుకాణం ముందు బైఠాయించారు..

షాకింగ్: వైసీపీలో పెను విషాదం -బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూత -సీఎం జగన్ దిగ్భ్రాంతిషాకింగ్: వైసీపీలో పెను విషాదం -బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూత -సీఎం జగన్ దిగ్భ్రాంతి

భయానక దాడి.. వీడియో వైరల్

భయానక దాడి.. వీడియో వైరల్

కాసేపటి తరువాత ఎమ్మెల్యే నారంగ్ దుకాణం నుంచి బయటకు రాగా.. అక్కడున్న రైతులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే దుస్తులు చించేచి, నగ్నంగా పరుగెత్తించిమరీ చితకబాదుడు బాదారు. ఎమ్మెల్యేతోపాటు ఇంకొందరు బీజేపీ నేతలపైనా రైతులు చేయిచేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. సుమారు గంటపాటు అక్కడి వాతావరణం రణరంగాన్ని తలపించింది. బీజేపీ ఎమ్మెల్యేను బట్టలూడదీసి రైతులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా,

హత్యాయత్నం కేసు.. సీఎం ఆగ్రహం

హత్యాయత్నం కేసు.. సీఎం ఆగ్రహం

ముక్త్సర్ జిల్లాలోని మాలోట్‌ పట్టణంలో అబోహర్ బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ పై రైతులు దాడి చేయడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు, ఖండనలు వ్యక్తమవుతున్నాయి. గుర్తుతెలియని 300 మంది రైతులపై హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేపై దాడిని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తోపాటు కాంగ్రెస్ పార్టీ సైతం తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు ఉపేక్షించేది లేదని..ఎమ్మెల్యేపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆయన ఆదేశించారు.

ఎమ్మెల్యేపై దాడికి రైతు సంఘాల ఖండన

కాగా, బీజేపీ ఎమ్మెల్యేపై రైతుల దాడి వ్యవహారం రాజకీయంగా సంచలనం రేపుతున్నది. రైతుల ముసుగులో కాంగ్రెస్ నేతలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పంజాబ్ లో ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ కూడా ఈ ఘటనను ఖండించింది. రైతు ఉద్యమానికి సారధ్యం వహిస్తోన్న 41 రైతు సంఘాల్లో కీలకమైన సంయుక్త్ కిసాన్ మోర్ఛా సైతం బీజేపీ ఎమ్మెల్యేపై దాడిని ఖండించింది. శాంతియుతంగా సాగుతోన్న ఉద్యమంలో హింసకు తావులేదని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.

English summary
Agroup of farmers thrashed a BJP MLA, tore his clothes and threw black ink at him in Malout in Punjab's Muktsar district on Saturday. BJP's Abohar MLA Arun Narang along with other local leaders were surrounded by a group of protesting farmers in Malout where had gone to address a press conference. The Shiromani Akali Dal (SAD), BJP, ruling Congress in Punjab condemned the incident. Samyukta Kisan Morcha (SKM) also condemned attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X