వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత సైనికులు చైనా జవాన్‌ను బంధించారా? ఇందులో నిజం ఎంత?: ధృవీకరించని ఆర్మీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత సైనికులు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్‌ను బంధించారా? సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఆ వీడియో వెనుక వాస్తవాలేంటీ? ప్రస్తుతం నెటిజన్లలో తలెత్తుతోన్న ప్రశ్నలు ఇవి. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్ తన దేశ సైనికులకు పిలుపునిచ్చారు. లడక్ సమీపంలో సరిహద్దులకు అవతల చైనా ఆర్మీ పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరింపజేసింది. యుద్ధ సామాగ్రిని తరలించింది.

Recommended Video

IndiaChinaFaceOff : ITBP & Indian Army Captured Chinese Soldier at Border? Video viral

ఇలాంటి పరిణామాల మధ్య ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండో టిబెట్ సరిహద్దు పోలీసులు చైనా సైనికుడిని బంధించారని, అతణ్ని చితగ్గొట్టి మరీ విడిచి పెట్టారని వార్తలు సోషల్ మీడియాలో విస్తృతం అయ్యాయి. దీనికి సంబంధించిన ఓ వీడియోను సాక్ష్యంగా ఉదహరిస్తున్నాయి. ఈ వీడియో ఎక్కడిదనేది, ఎప్పటిదనేది కూడా తెలియరావట్లేదు. దీనిపై మనదేశ ఆర్మీ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రతిస్పందన కూడా రాలేదు.

Viral Video: Is ITBP captured Chinese soldier at border?

లడక్ సమీపంలో భారత్, చైనా సరిహద్దుల వద్ద ఫింగర్-4, ఫింగర్-5 ప్రాంతం వద్ద భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చిన చైనా జవాన్లు, ఓ యుద్ధ ట్యాంకును ఐటీబీపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఈ వీడియోలో స్పష్టం చేస్తోంది. యుద్ధ ట్యాంకును భారత జవాన్లు ధ్వంసం చేయడం, చైనా సైనికుడిని బంధించడం ఇందులో రికార్డు అయింది. కొద్దిసేపటి తరువాత ఆ సైనికుడిని మనదేశ జవాన్లు విడిచి పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. చైనీయులకు బుద్ధి చెప్పారని అభిప్రాయపడుతున్నారు.

English summary
Is Indo Tibet Border Police (ITBP) and Indian Army was captured Chinese soldier at border?. A Video went viral in Social media platforms. Netizens was posts a video in Twitter that a Soldier captured by ITBP and Army soldiers later released him. But, Indian Army officials not confirmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X