• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

viral video: హ్యాట్పాఫ్ నితికా కౌల్ -ఆర్మీలో చేరిన పుల్వామా అమరుడి భార్య -లెఫ్టినెంట్ హోదాలో

|

భరతమాత పులకించిన తరుణమిది.. భారత సైన్యం గర్వంగా తలెత్తిన సందర్భమిది.. ఉగ్రవాదులపై పోరులో అమరుడైన ఆర్మీ అధికారి భార్య.. అతనికి నిజమైన నివాళి ఇదేనంటూ అదే ఆర్మీలో చేరిన అరుదైన దృశ్యానికి యావత్ భారత జాతి పులకించిపోతున్నది. పుల్వామా అమరుడు మేజర్ విభూతి శకర్ ధౌండియాల్ భార్య నితికా కౌల్ శనివారం అధికారికంగా ఇండియన్ ఆర్మీలో చేరారు.

మోదీకి గుడ్ బై, ప్రధానిగా గడ్కరీ -ఆర్కే బాంబు -కేంద్రానికి చంద్రబాబు మద్దతు -ఊసరవెల్లి మళ్లీ అంటూమోదీకి గుడ్ బై, ప్రధానిగా గడ్కరీ -ఆర్కే బాంబు -కేంద్రానికి చంద్రబాబు మద్దతు -ఊసరవెల్లి మళ్లీ అంటూ

జమ్మూకాశ్మీర్ కు చెందిన 29 ఏళ్ల నితికా కౌల్ షార్ట్ సర్వీసు కమిషన్ (SSC) ద్వారా ఆర్మీకి ఎంపికై, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. శనివారం జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ లో లెఫ్టినెంట్ హోదాతో నితికా భారత సైన్యంలోకి ప్రవేశించారు. నార్తరన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి.. నితికాకు మెడల్ ధారణ చేశారు.

viral video: Pulwama martyr Major Dhoundiyals wife Nitika Kaul joins Indian Army

రెండేళ్ల కిందటి పుల్వామా దాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు బలితీసుకోగా, ఆ ఘాతుకానికి పాల్పడిన జైషే మోహ్మద్ ముష్కరుల బృందాన్ని మట్టుపెట్టే క్రమంలో ఆర్మీ మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్, మరో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఆర్మీలో చేరడం ద్వారానే తన భర్తకు నిజమైన నివాళి అర్పిస్తానని ఆనాడే ప్రకటించిన నితికా ఇవాళ ఆ మాటను పూర్తి చేసుకున్నారు. లెఫ్టినెంట్ హోదాలో ఆమె సైన్యంలో చేరారు. కాగా,

కరోనాలో మోదీ సర్కార్ అనూహ్యం -ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వ దరఖాస్తులు -CAA రూల్స్ లేకున్నాకరోనాలో మోదీ సర్కార్ అనూహ్యం -ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వ దరఖాస్తులు -CAA రూల్స్ లేకున్నా

ఇటు సైన్యంలో చేరికతోపాటు కరోనాపై పోరాటంలోనూ నికితా కౌల్ ముందున్నారు. ప్రస్తుత విలయకాలంలో భద్రతా సిబ్బంది, పోలీసుల కోసం ఆమె సహాయ కార్యక్రమాలుచేశారు. తన సేవింగ్స్‌ అన్నీ బయటికి తీసి, సన్నిహితులు, బంధువులు, స్నేహితులతోపాటు తెలిసిన సైనిక కుటుంబాల నుంచి కూడా వీలైనంత డబ్బు పోగేసి, ఆ మొత్తంతో మాస్కులు, పీపీఈలు, గ్లౌజుల్లాంటి వెయ్యికి పైగా భద్రతా కిట్లు కొని హరియాణా రాష్ట్రంలోని పోలీసులకు అందజేసింది కౌల్.

viral video: Pulwama martyr Major Dhoundiyals wife Nitika Kaul joins Indian Army

''పోలీసులు కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. వాళ్లకు అండగా ఉండేందుకే ఈ చిన్న ప్రయత్నం'' అని నితికా పేర్కొనగా, ''మేజర్ ధౌండియాల్‌ దేశం కోసం ప్రాణాలర్పిస్తే.. ఆయన భార్య నికిత కౌల్ హరియాణా పోలీసులకు విలువైన సాయం అందించారు'' అని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రశంసించారు.

English summary
The widow of the Indian Army officer, Major Vibhuti Shankar Dhoundiyal, who was killed fighting terrorists in Pulwama in February 2019, donned olive green as she was commissioned into the Indian Army. Nitika Kaul passed out from the Officer’s Training Academy in Chennai, Tamil Nadu on Saturday and is now commissioned as a Lieutenant in the Indian Army.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X