వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:రాహుల్ గాంధీ పాటవం -బీజేపీ బేరాల భయం -విజయన్ వ్యంగ్యాస్త్రం

|
Google Oneindia TeluguNews

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో అన్ని పార్టీలూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వెస్ట్ బెంగాల్ లో సుదీర్ఘంగా 8 దశలు, అస్సాంలో 3 దశల్లో పోలింగ్ ఉండగా, ఒకే విడతలో ఎన్నికలు పూర్తికానున్న దక్షిణాది రాష్ట్రాలపై పార్టీలు ఫోకస్ పెంచాయి. కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తరచూ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో పర్యటిస్తూ సందడి చేస్తుండగా, సోదరి ప్రియాంక గాంధీ అస్సాంపై గురిపెట్టారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ వెళ్లిన చోట జనంతో మమేకమవుతూ డ్యాన్సులు, ఇతర విన్యాసాలతో ఆకట్టుకున్నారు. అలా..

జగన్ మీడియాలో నిందితులకు కవరింగ్ -హోం మంత్రి సుచరిత కీలుబొమ్మ: టీడీపీ అనిత విమర్శలుజగన్ మీడియాలో నిందితులకు కవరింగ్ -హోం మంత్రి సుచరిత కీలుబొమ్మ: టీడీపీ అనిత విమర్శలు

రాహుల్ వీడియోలు వైరల్..

రాహుల్ వీడియోలు వైరల్..

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మూడు రోజుల తమిళనాడు పర్యటనకు విచ్చేసిన రాహుల్ గాంధీ ర్యాలీలు, సభలతో సందడి చేస్తున్నారు. విద్యార్థులతో ఆడిపాడి, తన పాటవాన్ని ప్రదర్శించారు. తమిళనాడులోని ములగుమూదుబ్న్ సెయింట్ జోసెఫ్స్ మెట్రిక్యులేషన్ విద్యార్థులతో కలిసి రాహుల్ డ్యాన్స్‌ చేయడం, పదో తరగతి అమ్మాయితో పుష్-అప్స్ ఛాలెంజ్, మరో విద్యార్థికి మార్షల్ ఆర్ట్స్ 'ఐకిడో' మెలకువలు నేర్పిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా,

బీజేపీ బతకనీయదేమో..

బీజేపీ బతకనీయదేమో..

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్.. విద్యార్థులతో మమేకం కావడంతోపాటు పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తు కొనసాగిస్తోన్న కాంగ్రెస్.. రాబోయే రెండు రోజుల్లో సీట్ల షేరింగ్ ను ఖరారు చేయనుంది. కాగా, ఇటీవల పుదుచ్చేరిలో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడాన్ని ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు చేశారు రాహుల్. ఏదైనా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యయుతంగా మెజార్టీ సీట్లు సాధించినప్పటికీ, బీజేపీ అప్రజాస్వామిక పద్ధతులతో ఆ ప్రభుత్వాలను బతకనీయడంలేదని, బేరాలాడిమరీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. దీనిపై

బీజేపీ బేరం.. కాంగ్రెస్ అమ్మకం..

బీజేపీ బేరం.. కాంగ్రెస్ అమ్మకం..

కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించినప్పటికీ ఆయా ప్రభుత్వాలను బీజేపీ బతకనీయడం లేదన్న రాహుల్ వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి విజయన్ చమత్కారపూరిత విమర్శలు చేశారు. ''రాహుల్ చెప్పింది నిజం. కాంగ్రెస్ మెజార్టీ సాధించినా, బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని కూలగొడుతూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇది బీజేపీ బేరాలాట, కాంగ్రెస్ అమ్మకాల ఆట. ఇది తెలుసు కాబట్టే కేరళ ప్రజల కచ్చితంగా ఎల్డీఎఫ్ ను సమర్థిస్తారు'' అని విజయన్ ట్వీట్ చేశారు. కేరళలో ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు.. పశ్చిమ బెంగాల్ లో మాత్రం పొత్తు కుదుర్చుకోవడం తెలిసిందే.

viral video: కిమ్ కిరాక్ చర్య -32కి.మీ రైల్వే ట్రాలీని తోసుకుంటూ -రష్యాకు ఉత్తరకొరియా షాక్viral video: కిమ్ కిరాక్ చర్య -32కి.మీ రైల్వే ట్రాలీని తోసుకుంటూ -రష్యాకు ఉత్తరకొరియా షాక్

English summary
Congress leader Rahul Gandhi on Monday visited a school during his Tamil Nadu tour. He partnered a few students of St. Joseph's Matriculation Higher Secondary School on the stage for a group dance. The Congress leader also competed with a student for a round of push-ups. videos of Rahul gandhi dance, push-ups gone viral. in a dig on rahul, kerala cm pinarai vijayan sais that congress leader Doesn't Understand The Waters Of Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X