• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

viral video: నవ్వాలా, ఏడ్వాలా? -కరోనాకు ఆవు పేడ థెరపీపై అఖిలేశ్ విస్మయం -డాక్టర్లు వద్దంటున్నా..

|

కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ మరింత బలపడుతూ వేలాది మందిని పొట్టనపెట్టుకుంటుడగా, దాన్ని నిలువరించేందుకు డాక్టర్లు, సైంటిస్టులు, వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్లు శక్తికి మించి శ్రమిస్తున్నారు. అయితే కొందరు మేతావులు మాత్రం ఇవేవీ పట్టవన్నట్లు వికృత ప్రచారాన్నితెరపైకి తీసుకొచ్చారు. కొవిడ్ రోగానికి ఆవుపేడ థెరపీ అంటూ ఇటీవల కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి...

ఆవు పేడ‌తో క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చంటూ గుజరాత్‌కు చెందిన ఒక వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్న‌ది. ప్రధాని మోదీ ఇలాకా గుజరాత్ లో కొంతమంది ఆవుపేడ, మూత్రంతో థెరపీ చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని కరోనా రాదని, వచ్చినా త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుందని నమ్ముతున్నారు. ప్రజలు తమ శరీరంపై ఆవు పేడ పూసుకుంటారు. ఈ ఆవుపేడ చికిత్స వల్ల కరోనా రాకుండా వారి రోగనిరోధకశక్తి పెరుగుతుందని చాలామంది భావిస్తున్నారు. ఆవుపేడ చికిత్స కోసం జనం వస్తున్నారని ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అసోసియెట్ మేనేజరు గౌతమ్ మనీలాల్ బోరిసా చెప్పారు. వీటిపై..

viral video: Should We Cry Or Laugh?: Akhilesh Yadav On Cow Dung As Covid Cure

గుజరాత్ లో కరోనాకు ఆవు పేడ థెరపీ వ్యాప్తిలోకి రావడం, సదరు వీడియోలు వైరల్ కావడంపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ తీవ్రంగా స్పందించారు. ''దీన్ని చూసి మ‌నం న‌వ్వాలా లేక ఏడ్వాలా'' అంటూ విరక్తిపలుకులతో బుధవాంర సదరు వీడియోను రీపోస్ట్ చేశారు. ఆవుపేడను మూత్రమిశ్రమంతో కలిపి ఒంటికి పూసుకొని అది ఎండిపోయే వరకు ఆశ్రమంలో వేచి ఉంటూ, అనంతరం ఆశ్రమంలో ఆవును కౌగిలించుకుని, ఆవు పాలు లేదా మజ్జిగతో శరీరాన్ని కడుక్కోవడం ఈ థెరపీ క్రమం. అయితే..

viral video: Should We Cry Or Laugh?: Akhilesh Yadav On Cow Dung As Covid Cure

కొవిడ్ -19 కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆవు పేడ లేదా మూత్రం పనిచేస్తుందనే దానిపై ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జెఎ జయలాల్ చెబుతున్నారు. పైగా, ఆవుపేడ చికిత్స వల్ల జంతువుల నుంచి మనుషులకు ఇతర వ్యాధులు వ్యాపిస్తాయని హెచ్చరించారు.

  Hyderabad : గోవుని జాతీయ జంతువు గా పరకటించాలి.. అదొక్కటే అజెండా !

  English summary
  Samajwadi Party chief Akhilesh Yadav on Wednesday joined a chorus of voices commenting on a video from Gujarat's Ahmedabad - a video that shows men gleefully covering themselves in cow dung and urine in the belief it will protect them against COVID-19.A bemused Mr Yadav tweeted: "Should we cry or laugh over this...". Attached to his tweet was a video from a report by news agency Reuters that identified a school called the Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam, where some people go once a week to slather cow dung and urine over their bodies, hug cows and practice yoga.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X