• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

viral video: ఖాకీల రాక్షసం -మాస్కు సరిగా పెట్టుకోలేదని వ్యక్తిపై భయానక దాడి -చిన్న పిల్లాడు వేడుకున్నా..

|

కరోనా విలయ కాలంలో మహమ్మారికి ఏమాత్రం తగ్గకుండా సామాన్యుల్ని టార్గెట్ చేయడంలో ప్రభుత్వ యంత్రాంగమూ అత్యుత్సాహం ప్రదర్శించిందనే విమర్శలున్నాయి. లాక్ డౌన్ సమయంలో బయటికి వచ్చినవాళ్లను చితకబాదడం, లక్షల మంది కూలీలు నడిచి వెళుతున్నా ఆదరణ చూపకపోవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయినవాళ్లకు చేయుత అందించకపోవడం లాంటి విషయాలెన్నో చర్చలో ఉండగానే సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. ఏడాది తర్వాత కూడా మళ్లీ అవే భయానక దృశ్యాలు రిపీట్ అవుతున్నాయి..

చిక్కుల్లో శృతి హాసన్ -క్రిమినల్ కేసుకు బీజేపీ ఫిర్యాదు -తండ్రితో కలిసి అలా వెళ్లడంపై వివాదంచిక్కుల్లో శృతి హాసన్ -క్రిమినల్ కేసుకు బీజేపీ ఫిర్యాదు -తండ్రితో కలిసి అలా వెళ్లడంపై వివాదం

 మాస్కు సరిగా వేసుకోలేదని..

మాస్కు సరిగా వేసుకోలేదని..

అది మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్ నగరం.. మిట్టమధ్యాహ్నం సమయంలో ఆదరాబాదరాగా కొడుకును వెంట పెట్టుకుని ఆటోను స్టార్ట్ చేసి ఆస్పత్రి వైపునకు బయలుదేరాడో వ్యక్తి.. చికిత్స పొందుతోన్న తండ్రికి సమయంలోగా భోజనం అందించాలనే ఆత్రుత ఉన్నప్పటికీ బండిని జాగ్రత్తగానే నడుపుకుంటూ వెళ్లాడు.. కానీ ఆ కంగారులో మూతికి వేసుకున్న మాస్క్ కిందికి జారిపోయిన విషయాన్ని గుర్తించలేకపోయాడు. అప్పటికే సెంటర్లో కాపుకాసిన ఇద్దరు ఖాకీలు ఆటోను ఆపి.. మాస్కు సరిగా వేసుకోలేదనే కారణంతో డ్రైవర్ ను చితకబాదారు..

చిన్న పిల్లాడు వేడుకున్నా..

చిన్న పిల్లాడు వేడుకున్నా..

కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో పలు రాష్ట్రాలు మాస్కులు వేసుకోవడాన్ని తప్పని సరి చేశాయి. మధ్యప్రదేశ్ లోనూ ఈ నిబంధన అమలులో ఉంది. మాస్కులు ధరించని వారి నుంచి లక్షల రూపాయాల్లో జరిమానాలు వసూలవుతున్నాయి. కాగా, ఇండోర్ పోలీసులు మాత్రం చట్టాన్ని అతిక్రమిస్తూ, మాస్కు ధరించని ఆటో డ్రైవర్ పై దాడికి తెగబడ్డారు. ఇద్దరు పోలీసులు కలిసి బాధితుణ్ని రోడ్డుపైనే చితకబాదారు. అతి దారుణంగా కాళ్లతో తంతూ కిరాతకాన్ని ప్రదర్శించారు. బాధితుడి కొడుకైన ఎనిమిదేళ్ల బాలుడు.. ‘సార్.. మా నాన్నను కొట్టకండి.. వదిలేయండి..' అని హృదయ విదారకంగా ఏడ్చినా ఆ ఖాలీలు ఇంకాస్త రాక్షసంగా ప్రవర్తించారు.

వీడియో వైరల్.. తీవ్ర విమర్శలు..

ఇండోర్ సిటీలో ఒక ఆటో డ్రైవర్ పట్ల ఇద్దరు పోలీసుల కిరాతకంగా వ్యవహరించిన ఘటన తాలూకు వీడియో ఇంటర్నెట్ లో విపరీతంగా వైరలైంది. పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్న ఆ వ్యక్తిని 35 ఏళ్ల ఆటో డ్రైవర్ కృష్ణ ఖైర్‌గా గుర్తించారు. ఆయనపై దాడి చేసిన కానిస్టేబుళ్లు కమల్ ప్రజాపత్, ధర్మేంద్ర జాట్ అని తేలసింది. అమానవీయంగా వ్యవహరించిన పోలీసుల తీరును ఖండిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ఈ ఘటనను ఖండించారు. దీంతో..

కావర ఖాకీలపై వేటు..

కావర ఖాకీలపై వేటు..

పోలీసులు దాడి చేస్తున్న వీడియోతోపాటు బాధితుడి వివర ణతాలూకు మరో వీడియో కూడా వైరలైంది. ‘‘ఆస్పత్రిలో ఉన్న మా నాన్నను భోజనం తీసుకెళుతుండగా నా మాస్క్ జారిపోయింది. పోలీసులు నన్ను ఆపి, స్టేషన్‌కు రమ్మని బలవంతం చేశారు. లంచ్ బాక్స్ ఇచ్చి వస్తానని వేడుకున్నా పట్టించుకోలేదు. నేను బతిమాలుతుండగానే కొట్టడం మొదలుపెట్టారు..'' అని బాదితుడు కృష్ణ చెప్పుకొచ్చాడు. పట్టపగలు వ్యక్తిపై అనుచితంగా దాడికి పాల్పడిన నేరం కింద ఆ ఇద్దరు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

  #Weather Changed Drastically In Paderu Visakhapatnam

  షాకింగ్: జగన్‌పై సర్పయాగం -అంతు తేల్చేదాకా ఏపీలో అడుగు పెట్టను - నాకు ప్రధాని అండ: ఎంపీ రఘురామషాకింగ్: జగన్‌పై సర్పయాగం -అంతు తేల్చేదాకా ఏపీలో అడుగు పెట్టను - నాకు ప్రధాని అండ: ఎంపీ రఘురామ

  English summary
  A 35-year-old man was allegedly beaten up by two police constables on the road in Madhya Pradesh's Indore city on Tuesday after a dispute over not wearing a face mask which has been made mandatory in view of the COVID-19 outbreak. After a video of the alleged incident went viral on social media, both policemen were suspended, an official said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X