• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

viral video: ఆ గుండె ఆగింది -కరోనాతో ‘లవ్ యూ జిందగీ’ యువతి మృతి -జీవితం అన్యాయం చేసిందన్న సోనూ సూద్

|

పాండమిక్(మహమ్మారి) ప్రధాన లక్షణం ప్రజల్ని భయభ్రాంతికి గురిచేయడం. కరోనా లాంటి మహమ్మారులు మనుషుల ఆరోగ్యాలపై నేరుగా చూపించే ప్రభావం కంటే యావత్ మానవాళిపై మానసికంగా చూపించే ఎఫెక్ట్ తీవ్రమైనది. అందుకే కొవిడ్ విలయాన్ని ఎదుర్కోడానికి మానసిక బలం ఎంతో అవసరమని డాక్టర్లు చెబుతుంటారు. ఆ క్రమంలో కొవిడ్ సోకి ఆరోగ్యం క్షీణించినా, ఐసీయూ బెడ్ దొరకకున్నా కచ్చితంగా బతుకుతాననే ధీమాను ప్రదర్శించిందిందో యువతి. మరణశయ్యపై 'లవ్ యూ జిందగీ'పాటతో అందర్నీ ఆకట్టుకున్న ఆమె జీవితం విషాదంతంగా ముగిసింది..

  Love You Zindagi యువతి పై Sonu Sood ఆవేదన, భారతావని గుండె బరువెక్కింది!! || Oneindia Telugu

  పిడుగుపాటుకు 18 ఏనుగులు మృతి -చరిత్రలో రెండో అతిపెద్ద విషాదం -పోస్ట్‌మార్టంపై ఉత్కంఠపిడుగుపాటుకు 18 ఏనుగులు మృతి -చరిత్రలో రెండో అతిపెద్ద విషాదం -పోస్ట్‌మార్టంపై ఉత్కంఠ

  త‌న‌ను మృత్యువు క‌బ‌ళిస్తున్నా.. చివ‌రి నిమిషం వ‌రకూ ఆమె త‌న జీవితాన్ని ప్రేమించింది. ల‌వ్ యూ జింద‌గీ అంటూ హాస్పిట‌ల్ బెడ్‌పై కృత్రిమ శ్వాస తీసుకుంటూ కూడా ప్ర‌తి క్ష‌ణాన్నీ ఆస్వాదించింది. త‌న‌లాగే ఎంతో మంది కొవిడ్‌తో పోరాడుతున్న వాళ్ల‌లో స్ఫూర్తి నింపింది. అయినా ఆ ధైర్యం, త‌న జీవితంపై త‌న‌కున్న ప్రేమ ఆమెను కాపాడ‌లేక‌పోయాయి. అదే క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ ఆ యువ‌తి క‌న్నుమూసింది. మూడు ప‌దుల వ‌య‌సులోనే తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయింది.

  viral video: Woman Who Made People Smile ‘Love You Zindagi’ Video Dies of Covid; Sonu Sood reacts

  హాస్పిట‌ల్ బెడ్‌పై ఉన్నా కూడా ఎంతో చ‌లాకీగా ల‌వ్ యూ జింద‌గీ పాట వింటున్న వీడియోను ప్ర‌పంచం దృష్టికి తీసుకొచ్చిన డాక్ట‌ర్ మోనికానే ఆమె ఇక లేద‌న్న చేదు వార్త‌ను కూడా ట్విటర్ ద్వారా తెలిపింది. గురువారం రాత్రి ఆమె ఈ ట్వీట్ చేసింది. ఎంతో ధైర్య‌వంతురాలైన ఆ యువ‌తి ఇక లేద‌ని చెప్ప‌డానికి చాలా బాధ‌ప‌డుతున్నాను. ఆమె కుటుంబానికి, ఆమె రాక‌కోసం ఎదురు చూస్తున్న చిన్నారి కోసం ప్రార్థించండి అని డాక్ట‌ర్ మోనికా ట్వీట్ చేసింది.

  కొవిడ్‌తో పోరాడుతున్న ఆ యువ‌తి వ‌యసు కేవ‌లం 30 ఏళ్ల‌ని, ఆమెకు ఓ చిన్నారి కూడా ఉన్న‌ద‌ని గ‌తంలో మోనికా ఓ ట్వీట్‌లో తెలిపింది. అప్పుడు ఆమెకు ఐసీయూ బెడ్ దొర‌క‌లేదని, ఎలాగోలా చికిత్స అందిస్తున్నామ‌ని చెప్పింది. ఆ త‌ర్వాత ఈ నెల 10న ఆమెకు ఐసీయూ బెడ్ దొరికినా.. ప‌రిస్థితి క్షీణించింద‌ని, ఆమె కోసం ప్రార్థించాల‌ని మ‌రో ట్వీట్ చేసింది. చివ‌రికి ఇప్పుడు ఆమె మ‌న మ‌ధ్య‌లేద‌ని ఆమె చేసిన ట్వీట్ ఎంతో మందిని క‌ల‌చివేసింది.

  viral video: Woman Who Made People Smile ‘Love You Zindagi’ Video Dies of Covid; Sonu Sood reacts

  ఆమె ఎవ‌రో, ఆమె పేరేంటో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవరికీ తెలియ‌దు. కానీ ఆ వీడియో చాలా మందిని క‌దిలించింది. క‌ళ్ల ముందు చావు క‌నిపిస్తున్నా.. అంత చ‌లాకీగా ఆడిపాడుతూ అస‌లు జీవితం అంటే ఏంటో చెప్పిన ఆ యువ‌తి ఇక లేద‌న్న వార్త‌ను వాళ్లు తట్టుకోలేక‌పోతున్నారు. నా జీవితంలో ఆ పాట ఎప్పుడు విన్నా.. ఆమెనే గుర్తొస్తుంద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు.

  భారత్ బయోటెక్ అనూహ్య అడుగు -కొవాగ్జిన్ ఫార్ములా పంచుకోడానికి రెడీ -జగన్ లేఖతో మోదీ సర్కార్ కదలికభారత్ బయోటెక్ అనూహ్య అడుగు -కొవాగ్జిన్ ఫార్ములా పంచుకోడానికి రెడీ -జగన్ లేఖతో మోదీ సర్కార్ కదలిక

  'లవ్ యూ జిందగీ' వైరల్ వీడియో యువతి మరణంపై ప్రముఖ నడుటు, సమాజ సేవకుడు సోనూ సూద్ స్పందించారు. ''చాలా విచారంగా ఉంది, ఆమె తన కుటుంబాన్ని మళ్లీ చూడలేనని కలలో కూడా ఊహించి ఉండదు. జీవితం ఆమె పట్ల చాలా అన్యాయంగా వ్యవహరించింది. జీవించడానికి అర్హమైన చాలా జీవితాలు ముగిసిపోయాయీ విలయకాలంలో. మన జీవితం ఎంత సాధారణమైనప్పటికీ మనం ఈ దశ నుండి బయటకు రాలేము'' అని సోనూసూద్ ట్వీట్ చేశారు.

  English summary
  In a heartbreaking news, the 30-year-old woman who made people smile and won hearts on social media with her viral ‘Love You Zindagi’ video, has died. Dr Monika Langeh, who had originally posted the video featuring the song Love You Zindagi, took to Twitter to announce that the patient passed away on Thursday (May 13, 2021). She also requested people to pray for her family and child.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X