వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరభద్రసింగ్‌కు ఫాలోయింగ్‌కు కారణమిదే, సన్‌స్ట్రోక్‌ కాంగ్రెస్‌ కొంపముంచిందా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని మూట గట్టుకొంది. అయితే ఈ ఎన్నికల్లో తనయుడి కోసం వీరభద్రసింగ్ అసెంబ్లీ సీటును కూడ మార్చుకొన్నారు. కొడుకు కోసం తాను పోటీ చేసే సిమ్లా గ్రామీణ నియోజకవర్గాన్ని కొడుకు విక్రమాధిత్య కోసం కేటాయించారు.ఆర్కీ నియోజకవర్గం నుండి వీరభద్రసింగ్ పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం రాజకీయంగా విక్రమాదిత్య నష్టం కల్గించిందనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

మోడీ సంతోషంగా ఉన్నారా: ప్రకాశ్‌రాజ్, ట్విట్టర్‌లో సెటైర్లు

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన అనుభవం వీరభద్రసింగ్‌కు ఉంది. అయితే ఇప్పటివరకు సీఎంగా కొనసాగిన వీరభద్రసింగ్‌పై వచ్చిన ఆరోపణలు, ఇతర అంశాలు కాంగ్రెస్‌పార్టీని రాష్ట్రంలో ఓటమి పాలు చేశాయి.

అయితే హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కానుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తెలిపాయి. ఈ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వెలువడ్డాయి.

కొడుకు కోసం వీరభద్రసింగ్ త్యాగం

కొడుకు కోసం వీరభద్రసింగ్ త్యాగం

హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ తన కొడుకు కోసం తన అసెంబ్లీ సీటును కూడ మార్చుకొన్నాడు. సిమ్లా గ్రామీణ అసెంబ్లీ స్థానంలో కొడుకు విక్రమాదిత్యను పోటీకి దింపాడు. కాంగ్రెస్ పార్టీ విక్రమాదిత్యను తిరుగులేని నాయకుడిగా తీర్చిదిద్దేందుకు చేసిన ప్లాన్ కాంగ్రెస్ పార్టీ ఓటమితో నష్టం కల్గిందనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.సిమ్లా గ్రామీణ నియోజకవర్గాన్ని కొడుకు విక్రమాధిత్య కోసం కేటాయించారు.ఆర్కీ నియోజకవర్గం నుండి వీరభద్రసింగ్ పోటీ చేశారు.

వీరభద్రసింగ్‌కు ఫాలోయింగ్ అందుకే

వీరభద్రసింగ్‌కు ఫాలోయింగ్ అందుకే

రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో వీరభద్రసింగ్ అనుసరించిన విధానాలు, ముఖ్యమంత్రిగా ఆయన తీసుకొన్న నిర్ణయాల కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో వీరభద్రసింగ్‌కు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.సోషలిజాన్ని వీరభద్రసింగ్ ఫాలో అయ్యేవాడని విశ్లేషకులు చెబుతుంటారు. ప్రతి గ్రామానికి స్కూల్స్, వైద్యం అందేలా చర్యలు తీసుకొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉద్యోగావకాశాలను కల్పించారు.

మారిన వీరభద్రసింగ్ వైఖరి

మారిన వీరభద్రసింగ్ వైఖరి

1990 నుండి వీరభద్రసింగ్ వైఖరి మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్ రాజకీయాల్లో రావాలనే ఆసక్తిని చూపడంతో పాటు కొడుకు విక్రమాదిత్య కారణంగా వీరభద్రసింగ్‌పై ఆరోపణలు రావడం ప్రారంభమయ్యాయి.ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ఆరోపణలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందంటున్నారు విశ్లేషకులు.

ఓటమిని అంగీకరించిన వీరభద్రసింగ్

ఓటమిని అంగీకరించిన వీరభద్రసింగ్

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఓటమిని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ అంగీకరించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ ఓటమి పాలయ్యామని ఆయన వాపోయారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రచారం చేయకపోవడం కూడా తమ ఓటమికి కారణాల్లో ఒకటి అని ఆయన వ్యాఖ్యానించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. కానీ మేం ఎన్నికల్లో వెనుకబడిపోయాం. ఓటమిని నేను అంగీకరిస్తున్నా.. ఇది ప్రజాతీర్పు. కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రంలో ప్రచారం చేయకపోవడం కూడా పార్టీ ఓటమికి కారణాల్లో ఒకటని వీరభద్రసింగ్ చెప్పారు.

English summary
The ruling Congress’s defeat in the Himachal Pradesh assembly election would be remembered more for bringing to an end the era of the party’s popular leader Virbhadra Singh than for the BJP’s emphatic victory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X