వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యధిక కాలం హిమాచల్‌కు సీఎం వీరభద్రసింగ్: బిజెపికి కలిసొచ్చిన అంశాలివే

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Virabhadra Singh Was Elected First Time CM For Himachalpradesh

సిమ్లా: 1992లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడ అధికారాన్ని కైవసం చేసుకొనే దిశగా దూసుకుపోతోంది.అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలనే ఈ ఎన్నికల్లో బిజెపికి అధికారాన్ని కట్టబెట్టాయనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎం పదవిలో కొనసాగిన వ్యక్తిగా వీరభద్రసింగ్ రికార్డ్ సృష్టించారు.

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధిపత్యాన్ని బిజెపి దెబ్బకొట్టింది. అయితే వరుసగా బిజెపి లేదా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించిన సందర్భాలు తక్కువగా ఉన్నాయి.

సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైన సమయంలో కాంగ్రెస్ పార్టీ హవా ఈ రాష్ట్రంలో స్పష్టం కన్పించింది. అయితే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద వచ్చిన ఆరోపణలు కూడ ఆ పార్టీ ఓటమికి కారణమని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

1990 వరకు కాంగ్రెస్‌కు ఎదురేలేదు

1990 వరకు కాంగ్రెస్‌కు ఎదురేలేదు

కాంగ్రెస్ పార్టీకి 1990 వరకుహిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎదురే లేకుండా పోయింది.1952 మార్చి 8, యశ్వంత్ సింగ్ పార్మార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.1956 అక్టోబర్ 31 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 1963 జూలై 1వ,తేదిన ఆయన మరోసారి సీఎంగా భాద్యతలను చేపట్టారు.1977 జనవరి 28న ఠాకూర్ రాంలాల్ సీఎంగా బాధ్యతలను చేపట్టారు.1977 ఏప్రిల్ 30 వరకు ఆయన ఈ బాధ్యతల్లో ఉన్నారు.1990 వరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎదురు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.

1990లో బిజెపికి తొలిసారి అవకాశం

1990లో బిజెపికి తొలిసారి అవకాశం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి తొలిసారి అవకాశం దక్కింది.1990 మార్చి 5న, బిజెపికి చెందిన శాంతకుమార్ సీఎంగా బాధ్యతలను చేపటటారు. 1992 డిసెంబర్ 15వరకు ఆయన సీఎం పదవిలో ఉన్నారు.1992 డిసెంబర్ 15 నుండి 1993 డిసెంబర్ 3వరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.ఆ తర్వాత1998లో బిజెపి మరోసారి అధికారంలోకి వచ్చింది. 1998 మార్చి 24 నుండి 2003 మార్చి5 వరకు ప్రేమ్ ‌కుమార్ ధుమాల్ సీఎంగా ఉన్నారు.2007 డిసెంబర్ 30 నుండి 2012 డిసెంబర్ 28వరకు ప్రేమ్‌కుమార్ సీఎంగా ఉన్నారు.తాజా ఎన్నికల్లో బిజెపి అధిక స్థానాలను కైవసం చేసుకొన్నందున మరోసారి ప్రేమ్‌కుమార్ ధుమాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

అత్యధిక కాలం సీఎం వీరభద్రసింగ్

అత్యధిక కాలం సీఎం వీరభద్రసింగ్

హిమాచల్ ప్రదేశ్ సీఎంగా వీరభద్రసింగ్ నాలుగు దఫాలు పనిచేశారు.1983లో తొలిసారిగా వీరభ్రసింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు.1983 ఏప్రిల్ 8న, వీరభద్రసింగ్ సీఎంగా ఎన్నికయ్యారు. 1985 ఏప్రిల్ నుండి 1985 మార్చి8వ, తేదివరకు ఈ పదవిలో కొనసాగారు. 1985 మార్చి నుండి 1990 వరకు కూడ ఆయనే ఈ పదవిలో ఉన్నారు.1993 డిసెంబర్ 3న, వీరభద్రసింగ్ మరోసారి సీఎంగా ఎన్నికయ్యారు. 1998 మార్చి 23 వరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు.2003 మార్చి 6 నుండి 2007 30 డిసెంబర్ 30 వరకు ఈ పదవిలో కొనసాగారు.2012 నుండి వీరభద్రసింగ్ ఈ పదవిలో కొనసాగుతున్నారు.

రెండు దఫాలు రాష్ట్రపతి పాలన

రెండు దఫాలు రాష్ట్రపతి పాలన

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రెండు దఫాలు రాష్ట్రపతి పాలన కూడ కొనసాగింది. 1977 ఏప్రిల్ 30 నుండి 1977 జూన్ 22 వరకు రాష్ట్రపతి పాలన సాగింది. ఆ తర్వాత 1992 డిసెంబర్ 15 నుండి 1993 డిసెంబర్3 వరకు మరో దఫా రాష్ట్రపతి పాలన సాగింది.

బిజెపికి కలిసొచ్చిన అంశాలివే

బిజెపికి కలిసొచ్చిన అంశాలివే

బిజెపికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పలు అంశాలు కలిసివచ్చాయి. ప్రస్తుత సీఎం వీరభద్రసింగ్ ‌పై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాయి. ఎన్నికల ప్రచారంలో బిజెపి ఈ అంశాన్ని ప్రధాన ప్రచారస్త్రంగా చేసుకొంది. మరో వైపు బిజెపి సీఎం అభ్యర్థిగా ప్రేమ్‌కుమార్ థుమాల్‌ను బిజెపి ముందుగానే ప్రకటించింది. ఇది కూడ బిజెపికి కలిసివచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Virbhadra Singh highest time Cm record in Himachal Pradesh, in 1983 Virabhadra singh was elected first time CM for Himachalpradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X