వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాప్తిస్టు చర్చి ప్రతినిధి వీసా నిరాకరణ: మేఘాలయలో కమలానికి కష్టాలు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

తుర: మేఘాలయలో నెల రోజుల క్రితం జరిగిన కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రయత్నించిన అంతర్జాతీయ బాప్తిస్టు చర్చిలు, సంఘాల కూటమి సదస్సు అధ్యక్షుడు పాల్ మిజాకు కేంద్రం వీసా నిరాకరించింది. దీని ప్రభావం ఈ నెల 27వ తేదీన జరుగనున్న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షం నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓటమి పాల్జేయాలని బీజేపీ - ఎన్పీపీ తలపోస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో సుమారు 75 జనాభా క్రైస్తవులే కావడం గమనార్హం.

 2008 నుంచి అధికారంలో కాంగ్రెస్ పార్టీ

2008 నుంచి అధికారంలో కాంగ్రెస్ పార్టీ

2013 అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాలను పోటీ చేసిన బీజేపీ ఖాతా తెరువనే లేదు. 60 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 40 స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. మేఘాలయలో 2008 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గత వారం రాష్ట్రంలోని ఈస్ట్ గ్యారో హిల్స్ జిల్లాలోని మారుమూల రాజాసిమిలియా గ్రామంలోని చర్చి 150వ వార్షికోత్సవానికి రావాలని బాప్టిస్ట్ కన్వెన్షన్ అధ్యక్షుడు పాల్ మిజ్సాకు ఆహ్వానం పంపారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీసా నిరాకరించింది.

 చివరి క్షణంలో సుష్మా స్వరాజ్ విఫలం

చివరి క్షణంలో సుష్మా స్వరాజ్ విఫలం

పాల్ మిజ్సాకు చివరి క్షణంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కేజే అల్ఫోన్స్ ద్వారా వీసా ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారు. కానీ మిస్జా ఉత్సవాలకు హాజరు కాలేకపోయారు. మిస్జా పర్యటన విషయమై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు కన్రడ్ కే సంగ్మా కూడా లేఖ రాసినా ప్రయోజనం లేకపోయింది.

 చర్చి మనోభావాలు గాయపడ్డాయని ఇలా..

చర్చి మనోభావాలు గాయపడ్డాయని ఇలా..

ఫాథర్ పాల్ మీజ్సాకు వీసా నిరాకరించిన విషయమై బీజేపీ వివరణ ఇచ్చింది. క్యాథలిక్ చర్చి నాయకుడు ఒకరు మాట్లాడుతూ ‘మిస్జాకు వీసా నిరాకరించడం ద్వారా దేశంలోని ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క సామాజిక వర్గం ప్రయోజనాలను బీజేపీ సమగ్రద్రుష్టితో కాపాడతుందని మేమెలా చెప్పగలం? చర్చి మనోభావాలు తీవ్రస్థాయిలో గాయపడ్డాయి' అని అన్నారు.

 సందేహాలు ఉంటే విదేశీ పర్యాటకులపై నిఘా పెట్టొచ్చు

సందేహాలు ఉంటే విదేశీ పర్యాటకులపై నిఘా పెట్టొచ్చు

బాప్టిస్టు చర్చి 150వ వార్షికోత్సవానికి పాథర్ మీజ్సా హాజరు కావడం తప్పనిసరని ఆ చర్చి ప్రతినిధి పేర్కొన్నారు. ఆయన చర్చి వేడుకలకు హాజరు కావడానికే తప్ప.. ప్రజలను మార్చడానికి కాదని ఆ నేత చెప్పారు. ఒకవేళ ఏదైనా భయం ఉంటే విదేశీ పర్యాటకులపై నిఘా పెట్టవచ్చునన్నారు.

 కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం

కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం

పాథర్ మీజ్సాకు వీసా నిరాకరించే విషయమై బహిరంగ వ్యాఖ్య చేయడానికి బీజేపీ మేఘాలయ శాఖ అధ్యక్షుడు శిబున్ లింగ్డో దాటవేశారు. మేఘాలయ ప్రజలు దుష్పపరిపాలన సాగిస్తున్నకాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పడానికి, మార్పు తేవడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే పాథర్ మీజ్సా వీసా కోసం ఎన్పీపీ అధ్యక్షుడు కన్రడ్ కే సంగ్మా అధికారికంగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు గ్యారంటీ ఏమిటని కొందరు చర్చి ప్రతినిధులు సందేహాలు వ్యక్తం చేశారు.

 రెండేళ్ల క్రితం కూడా వీసా ఇచ్చినా హోంశాఖ నిఘా?

రెండేళ్ల క్రితం కూడా వీసా ఇచ్చినా హోంశాఖ నిఘా?

పాల్ మీజ్సాకు వీసా జారీ విషయమై విదేశాంగశాఖలో అధికారికంగా లేఖ వచ్చినట్లు ఆధారాలేమీ లేవని వారు తెలిపారు. గమ్మత్తేమిటంటే రెండేళ్ల క్రితం మేఘాలయలోని గ్యారో హిల్స్ జిల్లాలో పర్యటనకు వచ్చిన మీజ్సాపై కేంద్ర హోంశాఖ నిఘా కొనసాగింది. దాని కొనసాగింపుగా ఆయన వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేల్చారు

స్వదేశీ దర్శన్ యాత్రకు యత్నాలు

స్వదేశీ దర్శన్ యాత్రకు యత్నాలు

ఇదిలా ఉంటే కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన స్వదేశీ దర్శన్ ఆఫర్‌ను గతనెలలో మేఘాలయ క్యాథలిక్ చర్చి, ప్రెస్బిటెరియన్ చర్చిల ప్రతినిధులు తిరస్కరించారు. కేంద్రం తమపై ప్రేమతో ఈ ప్యాకేజీలు ఏర్పాటు చేయలేదని పరిష్ పాస్టోరల్ కౌన్సిల్ ఆఫ్ డి కాథడ్రల్ ఆఫ్ మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ బీ నాంగ్ భా వ్యాఖ్యానించారు.

కేంద్రం ప్యాకేజీల్లో భాగస్వామ్యం కాలేదన్న క్రైస్తవులు

కేంద్రం ప్యాకేజీల్లో భాగస్వామ్యం కాలేదన్న క్రైస్తవులు

ఎన్నికల్లో లబ్ది పొందడానికే ఈ ప్యాకేజీలు ఏర్పాటు చేసి, పరోక్షంగా క్రైస్తవులనూ ఎన్నికల రాజకీయాల్లో చర్చడానికి ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ప్రెస్బైటేరియన్ చర్చి అనుబంధ చర్చి మావ్ఖార్ ప్రెస్బైటేరియన్ చర్చి కూడా తాము కేంద్ర పర్యాటక శాఖ ప్యాకేజీల్లో భాగస్వామి కాదలుచుకోలేదని తేల్చి చెప్పాయి.

బీజేపీతో పోరుకు కాంగ్రెస్ భిన్నమైన ప్రచార వ్యూహం

బీజేపీతో పోరుకు కాంగ్రెస్ భిన్నమైన ప్రచార వ్యూహం

మేఘాలయలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హాజరైన సభలకు అంత పెద్దగా ప్రజలు హాజరు కాలేదు. బీజేపీతో పోటాపోటీ పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే భిన్నమైన ప్రచార సరళిని ఎంచుకున్నదని ఆ పార్టీ నేత పాలా చెప్పారు. సోషల్ మీడియాతోపాటు అన్ని వేదికల నుంచి బీజేపీ వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నామన్నారు.

 బీజేపీ 60.. 53 స్థానాల్లోనే ఎన్పీపీ పోటీ

బీజేపీ 60.. 53 స్థానాల్లోనే ఎన్పీపీ పోటీ

బీజేపీతో తాము యుద్ధమే చేస్తున్నామని, రేయింబవళ్లు బీజేపీ దాని మిత్రపక్షం ఎన్పీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని మేఘాలయ కాంగ్రెస్ నేత పాలా చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలకు పోటీ చేయగా, బీజేపీ మిత్రపక్షం ఎన్పీపీ మాత్రం కేవలం 53 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలుపడం ఆసక్తికర పరిణామం.

English summary
TURA (MEGHALAYA): The reported denial of visa to the president of a worldwide alliance of Baptist churches and organisations who was to visit Meghalaya earlier this month, may cost the BJP and its ally NPP in the February 27 Assembly polls, state Congress working president Vincent H Pala has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X