వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో విశాల్ ఇష్యూ: ఈసి సంచలనం నిర్ణయం, వేటు

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని ఆర్కే నగర్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వేలుస్వామిని ఎన్నికల కమిషన్ తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హీరో విశాల్ నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తూ వేలుస్వామి తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.

ఆ నేపథ్యంలో ఆయనపై ఈసీ వేటు వేసింది. విశాల్ నామినేషన్‌ పత్రాలపై రెండు సంతకాలు ఫోర్జరీవి అంటూ రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్‌ను గత బుధవారంనాడు తిరస్కరించారు. విశాల్, ఆయన మద్దతుదారులు దీనిపై వివరణ ఇవ్వడంతో కొద్దిసేపటికే నామినేషన్ పత్రాలను అంగీకరిస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి చెప్పారు.

Vishal issue RK Nagar returning officer removed

అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే విశాల్ నామినేషన్‌ను తిరిస్కరిస్తున్నట్టు మరోసారి ఆయన ప్రకటించారు. విశాల్, ఆయన మద్దతుదారులు తనపై ఒత్తిడి పెట్టడం వల్లనే తాను ఆయన నామినేషన్ పత్రాన్ని అంగీకరించాల్సి వచ్చిందని మునుస్వామి వివరణలో చెప్పినట్టు తెలుస్తోంది.0

మొత్తం వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరును ప్రతిపక్ష డీఎంకే కూడా తప్పు పట్టింది. వేలుస్వామిని బదిలీ చేయాలని డీఎంకే డిమాండ్ చేసింది.

English summary
RK Nagar bypoll returning officer Velu Swamy hs been removed by the EC in the rejection of Tamil actor Vishal nomination papers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X