వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫీని వీడుతున్న సిక్కా?: హెచ్‌పీఈతో డీల్.. మూర్తి చెప్పినట్లే ఆ పోస్టులో!

విశాల్ సిక్కా.. హెచ్‌పీఈ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐకానిక్ అమెరికన్ సంస్థ హెచ్‌పీఈ సిక్కాను తమ సంస్థలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇన్ఫోసిస్‌కు షాకిస్తూ సీఈవో పదవి నుంచి తప్పుకున్న విశాల్ సిక్కా.. హెచ్‌పీఈ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐకానిక్ అమెరికన్ సంస్థ అయిన హెచ్‌పీఈ సిక్కాను తమ సంస్థలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇన్ఫోసిస్‌లో సంచలనం: విశాల్‌ సిక్కా అవుట్‌, మూర్తి వస్తారా? చక్కదిద్దుతారా?ఇన్ఫోసిస్‌లో సంచలనం: విశాల్‌ సిక్కా అవుట్‌, మూర్తి వస్తారా? చక్కదిద్దుతారా?

కంప్యూటర్ సాఫ్ట్ వేర్, చిప్ మేకర్ దిగ్గజమైన హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ ప్రైజ్(హెచ్ పీఈ)లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా(సీటీవో) సిక్కా చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇన్ఫీ సీఈవోగా సిక్కా రాజీనామాకు ముందు.. అతనికి సీఈవో కన్నా సీటీవో పోస్ట్ బెటర్ అంటూ సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

Vishal Sikka likely to join Hewlett Packard Enterprise as CTO

ఆయన వ్యాఖ్యలకు తగ్గట్లే ఇప్పుడు సిక్కా హెచ్‌పీఈలో సీటీవో పదవిలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ప్రస్తుతం ఇన్ఫీలో ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగుతున్నారు.

కాగా, హ్యూలెట్ ప్యాకర్డ్ నుంచి విడిపోయి 2015లో హెచ్‌పీఈ ఏర్పడింది. ఈ సంస్థలో 2లక్షల మంది ఉద్యోగులున్నారు. డేటా సెంటర్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను హెచ్ పీఈ విక్రయిస్తోంది. దాంతో పాటు హెచ్ పీ పర్సనల్ కంప్యూటర్స్, ప్రిటర్స్ కూడా అమ్ముతోంది.

పునర్నిర్మాణమా?.. భారీ కుదుపా?: నీలేకని రీఎంట్రీపై డైరెక్టర్ల అసంతృప్తి, రాజీనామా దిశగా!పునర్నిర్మాణమా?.. భారీ కుదుపా?: నీలేకని రీఎంట్రీపై డైరెక్టర్ల అసంతృప్తి, రాజీనామా దిశగా!

హెచ్ పీఈ ప్రధాన కార్యాలయం పాల్ ఆల్టో. విశాల్ సిక్కా కూడా ఇదే ప్రాంతానికి చెందినవాడు కావడంతో హెచ్ పీఈలో చేరడానికే ఆయన మొగ్గు చూపుతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హెచ్‌పీఈకి ప్రస్తుతం మెక్ వైట్ మ్యాన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హెచ్‌పీఈలో సీటీవో పదవి ఖాళీగానే ఉంది.

English summary
Last Friday, Vishal Sikka ceased to be the CEO and managing director of Infosys and got a new designation as executive vicechairman. In less than a week, he has lost that position, too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X